Tuesday, September 17, 2024
Homeసినిమాఏకగ్రీవం కానిపక్షంలో పోటీ : మంచు విష్ణు

ఏకగ్రీవం కానిపక్షంలో పోటీ : మంచు విష్ణు

మా అధ్యక్ష పదవి విషయమై మంచు విష్ణు బహిరంగ లేఖ లేఖ రాశారు.

అందరికి నమస్కారం,

నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. పూర్వం మద్రాసులో తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం నటులకి కలిపి ఒక్క నడిగర్ సంఘం మాత్రమే వుండేది. మన తెలుగు సినీ నటీనటులకి ప్రత్యేకంగా ఒక అసోసియేషన్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ‘తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ ఏర్పాటు చేశారు. తెలుగు సినీ నటీనటుల కష్టసుఖాలు తెలిసిన తెలుగువారే అధ్యక్షులుగా వుంటూ చాలా మంచి పనులు చేస్తూ ‘తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ ని అద్భుతంగా నడిపారు.

ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ రావడం, 1993లో ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ని అక్కినేని నాగేశ్వరరావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, నాన్నగారు, చిరంజీవి గారు మరికొంతమంది పెద్దలు కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. నాన్నగారు ‘మా’ పదవిలో ఉన్నా, లేకపోయినా సినీ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉన్నారు.

1990లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మన సినీ కార్మికులకి నివాసం కల్పిద్దామనే సంకల్పంతో ఒక స్థలాన్ని కేటాయించింది. 1997లో దాన్ని ఒక పెద్ద రాజకీయ నాయకుడు తన ఫ్యాక్టరీ కోసం సొంతం చేసుకుందామని ప్రయత్నిస్తే, నాన్న గారికి ఆ విషయం తెలిసి సినీ కార్మికుల తరుపున అప్పటి గవర్నర్ రంగరాజన్ గారిని కలిసి ఒక పిటిషన్ సబ్మిట్ చేసి ఆ స్థలాన్ని సినీ కార్మికులకి చెందేలా చేసారు. అదే ఇప్పుడు మనకున్న చిత్రపురి కాలనీ.

ఇక్కడ ఒక విషయం నేను మీకు చెప్పాలి…

మురళీమోహన్ గారు ప్రెసిడెంట్ గా  ఉండి, నేను వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న టైంలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ కి అటెండ్ అయిన స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారితో మాట్లాడుతూ “మా అసోసియేషన్” కోసం కట్టించబోయే బిల్డింగ్ కి  అయ్యే మొత్తం ఖర్చులో 25 శాతం నేను, నా కుటుంబం ఇస్తాము అని చెప్పాను. 10-12 ఏళ్ళుగా ఆ బిల్డింగ్ కట్టాలని అందరు అంటూనే ఉన్నారు. ఇప్పటికి కూడా జరిగే ప్రతి ‘మా’ ఎలక్షన్స్ అదే ప్రధాన అజెండాగా వినిపిస్తుంది. నేను ఒక నిర్ణయానికి వచ్చాను.. ‘మా’ బిల్డింగ్ నిర్మాణానికి అయ్యే ప్రతి పైసా నేను ఇస్తాను.. నా కుటుంబంతో కలిసి ఆ బిల్డింగ్ ని నేను నిర్మిస్తాను.. మన దృష్టిలో అది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాదు. బిల్డింగ్ కావాలని అందరు కోరుకుంటున్నారు.. కట్టేద్దాం..డన్.. ఆ టాపిక్ కి  ఇక ఫుల్ స్టాప్ పెడదాం.

నేను ఇప్పటికీ నమ్మేది ఒక్కటే.. ఇండస్ట్రీ పెద్దలు అయిన కృష్ణ గారు, కృష్ణం రాజు గారు, సత్యనారాయణ గారు, నాన్న గారు, మురళీమోహన్ గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, జయసుధ గారు, రాజశేఖర్ గారు, జీవిత గారు, రాజేంద్రప్రసాద్ గారు, కోట శ్రీనివాస్ గారు, ఇంకా కొంతమంది పెద్దలు కూర్చుని ‘మా’ కుటుంబాన్ని నడిపించడానికి వాళ్ళే ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి పోటీ నుంచి తప్పుకుంటాను. ఏకగ్రీవం కాని పక్షంలో పోటీకి నేను సిద్ధం. పెద్దలను గౌరవిస్తాం.. వాళ్ళ సలహాలు పాటిస్తాం.. మా యంగర్ జనరేషన్ ని ఆశీర్వదించి.. ‘మా’ ప్రెసిడెంట్ గా  నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ…..

మీ బిడ్డ..
విష్ణు మంచు

RELATED ARTICLES

Most Popular

న్యూస్