పోలెండ్ క్రీడాకారిణి, వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ ఇగా స్వియ టెక్ యూఎస్ ఓపెన్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో జెస్సికా పెగులా పై 6-3; 7-6 తేడాతో విజయం సాధించి మరో టైటిల్ రేసులో నిలిచింది. రేపు జరగబోయే సెమీ ఫైనల్ మ్యాచ్ లో బెలారస్ అరీనా సబలేంక తో తలపడనుంది.
మరో సెమీ ఫైనల్లో ఫ్రాన్స్ ప్లేయర్, 17వ సీడ్ గార్సియా…. ఐదో సీడ్ ప్లేయర్ ట్యునిషియా కు చెందిన జాబెర్ తో ఆడనుంది.
ఈ ఏడాది జూన్ మొదటి వారంలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను గెల్చుకున్న స్వియ టెక్, ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ లో ఓటమి పాలైంది. స్వియతెక్ ఇప్పటి వరకూ గెల్చుకున్న రెండు గ్రాడ్ స్లామ్ టైటిల్స్ కూడా ఫ్రెండ్ ఓపెన్ (2020, 2022) కావడం గమనార్హం. యూఎస్ ఓపెన్ గెల్చుకొని తన ఖాతాలో మూడో టైటిల్ వేసుకోవాలని ఆమె ఆశిస్తోంది.