వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ ఇగా స్వియటెక్ (పోలాండ్), ఐదో సీడ్ జాబెర్ (ట్యునిషియా) యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ కు చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం జరిగిన సెమీఫైనల్ పోటీల్లో స్వియటెక్ 3-6;6-1;6-7 తేడాతో బెలారస్ క్రీడాకారిణి అరీనా సబలేంకను ఓడించింది.
మరో సెమీ ఫైనల్లో ఫ్రాన్స్ ప్లేయర్, 17వ సీడ్ గార్సియాపై జాబెర్ 6-1;6-3 తేడాతో విజయం సాధించింది.
స్వియటెక్ ఇప్పటి వరకూ రెండు గ్రాడ్ స్లామ్ టైటిల్స్ (ఫ్రెంచ్ ఓపెన్ 2020, 2022) గెల్చుకుంది. కాగా జాబెర్ ఈ ఏడాది వింబుల్డన్ ఫైనల్స్ కు చేరుకొని రన్నరప్ గా నిలిచింది. ఈ టైటిల్ గెలిస్తే ఆమెకు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ అవుతుంది.
స్వియటెక్-జాబేర్ లు ఇప్పటి వరకూ నాలుగుసార్లు ముఖాముఖి తలపడగా చెరో రెండు సార్లు విజయం సాధించారు. చివరగా మే 9న జరిగిన రోమ్ మాస్టర్స్ టోర్నీలో జాబేర్ పై స్వియటెక్ విజయం సాధించింది.
భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున (శనివారం అర్ధరాత్రి) ఒంటిగంటన్నరకు ఫైనల్ మ్యాచ్ జరగనుంది.