Tuesday, June 9, 2026
HomeTrending Newsస్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

75వ స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలకు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబైంది. దేశానికి స్వాతంత్ర్యం లభించి 75ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట  ఈ ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. రేపు ఉదయం  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి విజయవాడలో జరగనున్న రాష్ట్రస్ధాయి స్వాతంత్య్ర వేడుకలకు హాజరై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. ప్రదర్శన కోసం వివిధ శాఖలకు చెందిన శకటాలను కూడా స్టేడియంలో సిద్దం చేశారు.

ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్న దృష్ట్యా ఆహ్వనితులు, పాస్‌లు ఉన్నవారు ఉదయం 8 గంటలకల్లా సభా ప్రాంగణంలో కేటాయించిన సీట్లలో కూర్చోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌  బిశ్వభూషణ్  హరిచందన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తేనీటి విందు (ఎట్‌ హోమ్‌) కార్యక్రమం  ఏర్పాటు చేశారు. సిఎం జగన్మా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular