Saturday, July 27, 2024
Homeసినిమారవితేజ జోడీగా రీ ఎంట్రీ ఇస్తున్న ఇలియానా!

రవితేజ జోడీగా రీ ఎంట్రీ ఇస్తున్న ఇలియానా!

ఇలియానా తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో గ్లామరస్ హీరోయిన్ గా ఒక రేంజ్ లో దూసుకుపోయింది. నాజూకు భామగా ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. స్టార్ హీరోల జోడీగా భారీ సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంది. ‘జులాయి’ హిట్ తరువాత ఆమె ఇక్కడ గ్యాప్ తీసుకుని వరుసగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ వెళ్లింది. దాదాపు ఐదేళ్ల తరువాత రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా చేసింది. అయితే ఈ సినిమా పరాజయం పాలు కావడం వలన, ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు.

2018లో రవితేజతో ఇలియానా ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా చేసేటప్పటికే ఇలియానా బాగా లావైపోయింది. ఆ సినిమా ఫ్లాప్ అయిన తరువాత తెలుగు నుంచి ఆమెకి ఆఫర్లు కూడా వెళ్లలేదు. ఇలియానా నాజూకుదనం తగ్గడం వలన, ఇక ఆమెకి ను వైపు నుంచి అవకాశాలు వెళ్లడం కష్టమేనని అనుకున్నారు. అయితే ఇప్పుడు రవితేజ జోడీగానే ఆమె మరోసారి తెరపై సందడి చేయనున్నట్టుగా సమాచారం. రవితేజ హీరోగా హరీశ్ శంకర్ ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. పీపుల్ మీడియావారు ఈ సినిమాను నిర్మించనున్నారని అంటున్నారు.

రవితేజకీ .. హరీశ్ శంకర్ కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. రవితేజ సినిమాతోనే దర్శకుడిగా హరీశ్ శంకర్ కెరియర్ మొదలైంది. 4ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘మిరపకాయ్’ అనే హిట్ ఉంది. ఆ తరువాత ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీ అయ్యారు. ఇంతకాలానికి మళ్లీ కలిసి ఒక ప్రాజెక్టును చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ఇలియానాను తీసుకున్నారు. గతంలో రవితేజ – ఇలియానా కాంబినేషన్లో నాలుగైదు సినిమాలు వచ్చాయి. వాటిలో ‘కిక్’ పెద్ద సక్సెస్ అయింది. ఇద్దరూ కలిసి  చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ లో ఎలాంటి విశేషాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్