Sunday, January 19, 2025
HomeTrending Newsమళ్ళీ లాంగ్ మార్చ్ కు సిద్దమైన ఇమ్రాన్ ఖాన్

మళ్ళీ లాంగ్ మార్చ్ కు సిద్దమైన ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ రేపటి నుంచి మళ్ళీ లాంగ్ మార్చ్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి. పంజాబ్ ప్రావిన్సులోని వజీరాబాద్ నుంచే మార్చ్ ప్రారంభం కానుంది. వజీరాబాద్ లో ఇమ్రాన్ ఖాన్ పై హత్యా యత్నం జరిగింది. వజీరాబాద్ నుంచి రావల్పిండి చేరుకోవటానికి పది నుంచి 14 రోజులు పట్టే అవకాశం ఉంది. కాలు నొప్పి వాళ్ళ ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలో జరిగే సభలో పాల్గొంటారని సమాచారం.

మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కు మీడియా కవరేజీ దక్కకుండా ప్రభుత్వం, మిలిటరీ ఎత్తులు వేస్తున్నాయి. ఇమ్రాన్ లాంగ్ మార్చ్ తో దేశంలో అంతర్గతంగా అల్లర్లు పెరిగే ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు నివేదికలు సమర్పించాయి. ఇందులో భాగంగానే ఇమ్రాన్ మార్చ్ కవరేజీ చేయమని పాకిస్తాన్ ఎలెక్ట్రానిక్ మీడియా రేగ్యులటరీ కమిటీ ప్రకటించింది. ఇమ్రాన్ ఏకాకిని చేసేందుకు మిలిటరీ కుయుక్తులు పన్నుతోందని పిటిఐ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇమ్రాన్ ను ప్రజా జీవితం నుంచి తప్పుకునేలా… తనకు తానె దేశం వదిలి వెల్లిపోయేలా మిలిటరీ కుట్రలు చేయటం పాకిస్తాన్ లో పరిపాటిగా మారింది.

హత్యాయత్నం తర్వాత ఇమ్రాన్‌ తొలిసారి ప్రజల ముందుకొచ్చారు. ఆసుపత్రిలో వీల్‌ఛైర్‌లో కూర్చొని తనపై జరిగిన దాడి గురించి మాట్లాడారు. కుడి కాలికి నాలుగు తూటాలు తగిలినట్టు చెప్పారు. దాడి జరుగుతుందని తనకు ముందే సమాచారం ఉందన్నారు. వజీరాబాద్‌, గుజరాత్‌లో తనను చంపేందుకు పథకం రచించినట్లు ముందు రోజే తెలిసిందన్నారు. పంజాబ్‌ మాజీ గవర్నర్‌ సల్మాన్‌ తసీర్‌ను చంపినట్టే తనను కూడా హత్య చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. దేశంలో ముందస్తు ఎన్నికలు జరపాలన్న డిమాండ్‌తో పాక్‌ పంజాబ్‌లోని వజీరాబాద్‌ అల్లావాలాచౌక్‌లో లాంగ్‌మార్చ్‌ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ర్యాలీలో ప్రజలనుద్దేశించి ప్రసింగించేందుకు ఇమ్రాన్‌ కంటెయినర్‌పైకి ఎక్కి నిలబడిన సమయంలో.. ఓ దుండగుడు ఇమ్రాన్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన కాలికి గాయాలయ్యాయి.

Also Read : పాక్ సైన్యానికి వ్యతిరేకంగా నిరసనలు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్