తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రాజెక్టులు, నీటి సమస్యల అంశాల్లో విమర్శలు-ప్రతివిమర్శలతో వివాదం ముదురుతోంది. జల వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని.. ప్రాజెక్టు భద్రతా కారణాల దృష్ట్యా.. జూరాల ప్రాజెక్టు మీద రాకపోకలను నిలిపివేయడం జరిగింది. ప్రాజెక్టుతో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసు పహారా పెంచారు. ఈ రోజు నుంచి ప్రాజెక్టు పైకి వెళ్లేందుకు అనుమతించటం లేదు.
దీంతో గద్వాల, ఆత్మకూరు, మక్తల్ తదితర ప్రాంతాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ సమయంలో ఎవరు కూడా ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికారులు కోరుతున్నారు.