టి20 వరల్డ్ కప్ సూపర్-8లో ఇండియా బోణీ కొట్టింది. నేడు జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై 47 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించింది. బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా మరోసారి 3 వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశాడు.
ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేయగా, లక్ష్య సాధనలో ఆఫ్ఘన్ 20 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రాతో పాటు అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు సాధించగా… కుల్దీప్ యాదవ్ రెండు; అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు.
బార్బడోస్ లోని కెన్సింగ్ టన్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియా 11 పరుగులకే కెప్టెన్ రోహిత్ (8) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రిషబ్ పంత్ (20); కోహ్లీ (24) ఎనిమిది పరుగుల తేడాతో ఇద్దరు ఔటయ్యారు. శివం దూబే మరోసారి విఫలమై 10 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఈ దశలో సూర్య కుమార్ యాదవ్- హార్దిక్ పాండ్యాలు ఐదవ వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి సత్తా చాటారు. సూర్య 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ లతో 53; హార్దిక్ 24బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 రన్స్ చేశారు.
లక్ష్య సాధనలో ఆఫ్ఘన్ 23 పరుగులకే మూడు కీలక వికెట్లు కష్టాల్లో పడింది. అజ్మతుల్లా ఉమర్జాయ్ ఒక్కడే 26 పరుగులు చేసి హయ్యస్ట్ స్కోరర్ గా నిలిచాడు మిగిలినవారు విఫలమయ్యారు.
సూర్య కుమార్ యాదవ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.