Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్హాకీ: ఫ్రాన్స్ పై ఇండియా ఘనవిజయం

హాకీ: ఫ్రాన్స్ పై ఇండియా ఘనవిజయం

Men’s FIH Pro League: ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పురుషుల ఎఫ్.ఐ.హెచ్. ప్రో లీగ్ 2021-22 లో భాగంగా నేడు ఇండియా-ఫ్రాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా 5-0తో ఫ్రాన్స్ ను చిత్తు చేసింది.

సౌతాఫ్రికా లోని యూనివర్సిటీ అఫ్ నార్త్ వెస్ట్ పోట్చెఫ్ స్ట్రామ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆట 21వ నిమిషంలో ఇండియా ఆటగాడు హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచి బోణీ కొట్టాడు. 24వ నిమిషంలో వరుణ్ కుమార్ పెనాల్టీ కార్నర్ గోల్ సాధించాడు. షంషేర్ షింగ్ 28వ నిమిషంలో, 32వ నిమిషంలో మన్ దీప్ సింగ్, 41వ నిమిషంలో ఆకాష్ దీప్ సింగ్ లు మూడు స్ట్రెయిట్ గోల్స్ సాధించి ఇండియాకు 5-0తో తిరుగులేని ఆధిక్యం సంపాదించారు.

ఫ్రాన్స్ ఏ దశలోనూ ఇండియాకు పోటీ ఇవ్వలేకపోయింది.

రేపు మంగళవారం ఇదే గ్రౌండ్ లో ఆతిధ్య సౌతాఫ్రికాతో ఇండియా మ్యాచ్ జరగనుంది.

Also Read : రెండో మ్యాచ్ లోనూ ఇండియాదే విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్