Sunday, June 14, 2026
Homeస్పోర్ట్స్IND Vs IRE: ఇండియాదే టి20 సిరీస్

IND Vs IRE: ఇండియాదే టి20 సిరీస్

ఐర్లాండ్ తో ఆ దేశంలో జరుగుతోన్న టి 20 సిరీస్ ను ఇండియా కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా లక్ష సాధనలో ఐర్లాండ్ 8 వికెట్లు కోల్పోయి 152  పరుగులే చేసింది.

డబ్లిన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆతిథ్య ఐర్లాండ్ టాస్ గెలిచి ఇండియాకు బ్యాటింగ్ అప్పగించింది. 34 పరుగులకు  రెండు వికెట్లు (యశస్వి జైస్వాల్-18; తిలక్ వర్మ-1) కోల్పోయింది. ఈ దశలో రుతురాజ్ గైక్వాడ్- సంజూ శామ్సన్ మూడో వికెట్ కు 71 పరుగులు జోడించారు.  రుతురాజ్ 43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 58;  సంజూ 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో  40 పరుగులు చేసి ఔటయ్యారు . ఆ తర్వాతా వచ్చిన రింకూ సింగ్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38;  శివమ్ దుబే 16 బంతుల్లో 2 సిక్సర్లతో 22 పరుగులతో సత్తా చాటడంతో ఇండియా 185 స్కోరు చేసింది.

ఆతర్వాత బ్యాటింగ్  మొదలు పెట్దిన ఐర్లాండ్ కు మూడో ఓవర్లో 19 పరుగుల వద్ద గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రసిద్ కృష్ణ ఒకే ఓవర్లో రెండు వికెట్లు ( కెప్టెన్ పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టకర్ ఇద్దరూ డకౌట్) పడగొట్టారు. జట్టులో ఓపెనర్ అండ్రూ  బాల్బిర్న్ 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేసి రాణించాడు. మార్క్ అడైర్-23; కర్టిస్ కాంపర్-18 రన్స్  చేశారు.  ఓవర్లు పూర్తయ్యే సమయానికి ఐర్లాండ్ 152 స్కోరు చేయగలిగింది. దీనితో ఇండియా 33 పరుగులతో విజయం సాధించి సిరీస్ ను సొంతం చేసుకుంది.

బుమ్రా, ప్రసిద్, రవి బిష్ణోయ్ తలా రెండు, అర్ష్ దీప్ ఒక వికెట్ సాధించారు.

రింకూ సింగ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular