Sunday, June 7, 2026
Homeస్పోర్ట్స్Women Hockey WC:  జపాన్ పై ఇండియా గెలుపు

Women Hockey WC:  జపాన్ పై ఇండియా గెలుపు

మహిళల హాకీ వరల్డ్ కప్-2022లో 9 నుంచి 12 స్థానాల కోసం జరిగిన పోటీల్లో జపాన్ పై ఇండియా 3-1  తేడాతో విజయం సాధించింది.  ఆట 20వ నిమిషంలో జపాన్ పెనాల్టీ కార్నర్ ద్వారా తొలి గోల్ సాధించింది. ఇండియా క్రీడాకారిణి నవనీత్ కౌర్ 30వ నిమిషంలో ఫీల్డ్ గోల్ చేసి స్కోరు సమం చేసింది. 38వ నిమిషంలో  ఎక్కా దీప గ్రేస్ పెనాల్టీ కార్నర్ తో మరో గోల్ సంపాదించి 2-1 ఆధిక్యానికి తీసుకెళ్ళింది. 45వ నిమిషం చివరి క్షణాల్లో నవనీత్ మరో ఫీల్డ్ గోల్ సాధించి ఆధిక్యం మరింత పెంచింది.

క్వార్టర్ ఫైనల్స్ కు చేరలేకపోయినా విజయంతో ఇండియా తన వరల్డ్ కప్ టూర్ ముగించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular