Friday, November 22, 2024
Homeస్పోర్ట్స్ఛాంపియన్స్ టోర్నీ: ఇండియాకు మూడో స్థానం

ఛాంపియన్స్ టోర్నీ: ఇండియాకు మూడో స్థానం

India in 3rd :  ఏషియన్ ఛాంపియన్ షిప్ టోర్నీలో పాకిస్తాన్ పై ఇండియా 4-3 తేడాతో విజయం సాధించింది.  మూడో స్థానం కోసం డిపెండింగ్ ఛాంపియన్ల మధ్య నేడు జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో ఇండియా తన పట్టు నిలుపుకుంది. చివరి పావు భాగంలో రెండు జట్లూ  నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. చివరకు విజయం ఇండియా ను వరించింది. నిన్న జరిగిన సెమీ ఫైనల్లో జపాన్ చేతిలో 5-3 తేడాతో ఇండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే, మరో సెమీ ఫైనల్లో సౌత్ కొరియా 6-5 తో పాకిస్తాన్ పై విజయం సాధించింది. దీనితో నేడు దాయాదుల మధ్య మూడో స్థానంకోసం పోరు జరిగింది.

ఆట రెండో నిమిషంలోనే హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచి ఇండియాకు బోణీ చేశాడు. 10 వ నిమిషంలో పాక్ ఆటగాడు అఫ్రాజ్ ఫీల్డ్ గోల్ చేసి స్కోరు సమం చేశాడు. రెండో  పావు భాగంలో రెండు జట్లు  గోల్ చేయలేక పోయాయి. మూడో పావు భాగంలో పాక్ ఆటగాడు అబ్దుల్ రానా (౩౩ వ ని.- పెనాల్టీ కార్నర్) గోల్ చేసి 2-1 లీడ్ అందించాడు. మూడో పావు భాగం చివరి క్షణాల్లో మన ఆటగాడు సుమిత్ ఫీల్డ్ గోల్ చేసి స్కోరు మళ్ళీ సమం చేశాడు.  ఆ తర్వాత 54, 57 నిమిషాల్లో వరుణ్ కుమార్ (పెనాల్టీ కార్నర్) , ఆకాష్ దీప సింగ్ (ఫీల్డ్ గోల్) గోల్స్ అందించి స్కోరు 4-2తో  ఆధిక్యం అందించారు. అయితే 57 నిమిషంలోనే పాక్ ఆటగాడు అహ్మద్ నదీం ఫీల్డ్ గోల్ అందించి టెన్షన్ రేకెత్తించాడు. చివరి మూడు నిమిషాలు ఇండియా ఆటగాళ్ళు పాక్ కు మరో గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా ఆధిక్యం కాపాడుకొని  విజయం అందించారు.

ఇండియా కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు.

Also Read : చివరి లీగ్ మ్యాచ్ లోనూ ఇండియా విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్