Wednesday, June 26, 2024
Homeస్పోర్ట్స్T20WC: ఉత్కంఠ పోరులో ఇండియాదే విజయం

T20WC: ఉత్కంఠ పోరులో ఇండియాదే విజయం

దాయాదుల పోరులో ఇండియా మరోసారి తన ఆధిపత్యం నిరూపించుకుంది. టి 20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్ లో ఇండియా 6 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 119 పరుగులే చేసిన ఇండియా… బౌలర్లు అద్భుతంగా రాణించడంతో పాక్ ను 113 పరుగులకే కట్టడి చేసి విజయం అందుకుంది.

న్యూయార్క్ లోని నస్సౌ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పాక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది, తొలి ఓవర్ పూర్తి కాగానే మరోసారి వర్షం ఆటంకం కలిగించినా కాసేపటికే మ్యాచ్ ఆరంభం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జట్టు స్కోరు 12 వద్ద విరాట్ (4) ఔటయ్యాడు. ఆ కాసేపటికే రోహిత్ (13) కూడా పెవిలియన్ చేరాడు. చాలా రోజుల తరువాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతోన్న రిషభ్ పంత్ 31 బంతుల్లో 6 ఫోర్లతో 42, అక్షర్ పటేల్ 20 పరుగులు చేశారు. మిగలిన వారు విఫలం కావడంతో ఇండియా 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయ్యింది. పాక్ బౌలర్లలో నషీమ్ షా, హారిస్ రాఫ్ చెరో 3; అమీర్ 2; షాహీన్ ఆఫ్రిది ఒక వికెట్ పడగొట్టారు.

పాక్ తొలి వికెట్ (బాబర్ అజామ్ 13) కు 26 రన్స్ చేసింది. రిజ్వాన్ 31; ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్ చెరో 13; ఇమాద్ వసీమ్ 15 పరుగులు చేసి ఔటయ్యారు. సరైన భాగస్వామ్యం నమోదు చేయలేకపోవడంతో పాక్ 20 ఓవర్లు పూర్తయ్యే నాటికి 7 వికెట్లు కోల్పోయి 113 పరుగులే చేసింది.

మూడు వికెట్లతో రాణించిన బుమ్రా కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దకింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్