Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్Ind Vs. SL: ఇండియా రికార్డుల మోత – సిరీస్ క్లీన్ స్వీప్

Ind Vs. SL: ఇండియా రికార్డుల మోత – సిరీస్ క్లీన్ స్వీప్

శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో ఇండియా 317 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ సూపర్ విజయంతో ఇండియా వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది.  మరోవైపు విరాట్ కోహ్లీ మరోసారి తన సత్తా చాటి 110 బంతుల్లో  13 ఫోర్లు, 8 సిక్సర్లతో 166పరుగులతో అజేయంగా నిలిచి వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు కెక్కాడు. అత్యధిక సెంచరీలు (49) సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డుకు మరో మూడు సెంచరీ ల దూరంలో ఉన్నారు, శ్రీలంకపై అత్యధిక సెంచరీ (10) సాధించిన ఆటగాడిగా కూడా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.  సిరాజ్ తన వన్డే కెరీర్ లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు.

తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు రోహిత్-శుభ్ మన్ గిల్ లు 95 పరుగులు చేశారు. రోహిత్ 45 పరుగులు చేసి ఔట్ కాగా, రెండో వికెట్ కు కోహ్లీ- గిల్ లు 131 జోడించారు. వన్డేల్లో గిల్ రెండో సెంచరీ నమోదు చేశాడు. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 116 పరుగులు చేసి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. శ్రేయాస్ అయ్యర్ -38 రన్స్ చేశాడు.

నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగుల భారీ స్కోరు చేసింది.  లంక బౌలర్లలో రజిత, కుమార లాహిరు చెరో రెండు; కరునరత్నే ఒక వికెట్ పడగొట్టారు.

భారత పేస్ బౌలింగ్ ధాటికి లంక బ్యాటింగ్ లైనప్ కుప్ప కూలింది.  ఏడు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన లంక వరుస వికెట్లు సమర్పించుకుంది. సిరాజ్ 10 ఓవర్లు బౌల్ చేసి 32 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు సాధించారు.

విరాట్ కోహ్లీ కి ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ తో పాటు ప్లేయర్ అఫ్ ద సిరీస్ కూడా లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్