Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్టి20 సిరీస్: శ్రీలంకపై ఇండియా క్లీన్ స్వీప్

టి20 సిరీస్: శ్రీలంకపై ఇండియా క్లీన్ స్వీప్

Another Clean Sweep: శ్రీలంకతో జరిగిన టి 20 సిరీస్ ను ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. శ్రేయాస్ అయ్యర్ మరోసారి తన బ్యాట్ తో సత్తా చాటడంతో ఇండియా 16.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించి, 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడో మ్యాచ్ ల సిరీస్ ను ఏకపక్షంగా గెల్చుకుంది.

హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియంలో జరిగిన నేటి మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇండియా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. ఇషాన్ కిషన్ గాయంతో వైదొలగగా, భువి, బుమ్రా, యజువేంద్ర చాహల్ లకు విశ్రాంతి ఇచ్చారు. వీరి స్థానంలో రవి బిష్ణోయ్, కులదీప్ యాదవ్, ఆవేష్ ఖాన్, మహమ్మద్ సిరాజ్ జట్టులో చేరారు.

శ్రీలంక 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ గుణతిలకను సిరాజ్ బౌల్డ్ ద్వారా డకౌట్ చేశాడు, మరో ఓపెనర్ పాథుమ్ నిశాంక కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవేష్ ఖాన్ బౌలింగ్ లో వెంకటేష్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత అసలంక (4);  జనిత్ లియనాగే (9) పరుగులకే అవుట్ అయ్యారు.  వికెట్ కీపర్ చండీమల్ 22  పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఈ దశలో కెప్టెన్ శనక ధాటిగా ఆడి మంచి స్కోరు సాధించడంలో తోడ్పడ్డాడు, 38 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  శ్రీలంక నిర్ణీత 20 ఒవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 146  పరుగులు చేసింది. ఇండియా బౌలర్లలో ఆవేష్ ఖాన్ రెండు; సిరాజ్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్ తలా ఒక వికెట్ సాధించారు.

లంక విసిరిన 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఇన్నింగ్స్ ను కెప్టెన్ రోహిత్ తో కలిసి సంజూ శామ్సన్ ఆరంభించాడు. రోహిత్ 5 పరుగులే చేసి ఔటయ్యాడు. సంజూ 18, దీపక్ హుడా-21; వెంకటేష్ అయ్యర్ – 5 పరుగులు చేశారు. కొంతకాలంగా మంచి ఫామ్ లో ఉన్న శ్రేయాస్ ఈ మ్యాచ్ లోనూ కూడా రాణించి 45 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ తో 73; రవీంద్ర జదేజా 22 పరుగులతోను అజేయంగా నిలిచారు.  లంక బౌలర్లలో లాహిరు కుమార రెండు; దుష్మంత చమీర, కరునరత్నే చెరో వికెట్ సాధించారు.

శ్రేయాస్ అయ్యర్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ తో పాటు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ కూడా లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్