Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్జూనియర్స్ హాకీ; సెమీస్ కు ఇండియా

జూనియర్స్ హాకీ; సెమీస్ కు ఇండియా

హాకీ పురుషుల జూనియర్ వరల్డ్ కప్  క్వార్టర్ ఫైనల్స్ లో ఇండియా బెల్జియం పై 1-0 తేడాతో విజయం సాధించింది. ఎల్లుండి జరిగే సెమీ ఫైనల్ లో జర్మనీ తో తపడనుంది. ఓడిశా రాజధాని భువనేశ్వర్, కళింగ స్టేడియంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో  నేడు నాలుగు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లు పూర్తయ్యాయి. నాలుగో మ్యాచ్ లో బెల్జియంతో ఇండియా తలపడింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో చివరకు ఇండియాది పైచేయిగా నిలిచింది.

స్పెయిన్– జర్మనీ ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో నిర్ణీత సమయానికి రెండు జట్లూ 2-2 తేడాతో సమంగా ఉండడంతో షూటౌట్ ద్వారా జర్మనీ 3-1తో గట్టెక్కింది.

రెండవ మ్యాచ్ లో అర్జెంటీనా జట్టు నెదర్ల్యాండ్స్ పై 2-1…. మూడవ మ్యాచ్ లో మలేషియాపై ఫ్రాన్స్ 4-0 తేడాతో విజయం సాధించాయి.

డిసెంబర్ 3న జరగనున్న సెమీ ఫైనల్స్ లో ఇండియా –జర్మనీ; ఫ్రాన్స్- అర్జెంటీనా జట్లు తలపడనున్నాయి,

RELATED ARTICLES

Most Popular

న్యూస్