Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్థామస్ కప్ : ఫైనల్లో ఇండియా

థామస్ కప్ : ఫైనల్లో ఇండియా

థామస్ కప్ లో సరికొత్త చరిత్ర సృష్టించడానికి ఇండియా ఒక అడుగు దూరంలో ఉంది. నిన్న మలేషియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో విజయం సాధించి 43 ఏళ్ళ తరువాత సెమీస్ లో అడుగు పెట్టిన ఇండియా అదే పోరాట పటిమ, క్రీడాస్ఫూర్తి కొనసాగించి నేడు జరిగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో డెన్మార్క్ పై ఇండియా 3-2 తేడాతో విజయం సాధించి ఫైనల్ పోరుకు సిద్ధమైంది. థామస్ కప్ చరిత్రలో ఇండియా ఫైనల్స్ కు చేరడం ఇదే తొలిసారి.

ఎల్లుండి 15వ తేదీన జరగబోయే ఫైనల్స్ లో ఇండోనేషియాతో ఇండియా తలపడనుంది. 

స్కోరు 2-2 తో సమం అయినప్పుడు హెచ్ ఎస్ ప్రన్నోయ్ మరోసారి సత్తా చాటి ఇండియా ఫైనల్లో అడుగు పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. రాస్మస్ జేమ్కే పై 13-21తో తొలి సెట్ కోల్పోయినా సంయమనం కోల్పోకుండా తిరిగి  ఫామ్ లోకి వచ్చి 21-9; 21-12తో రెండు వరస సెట్లు గెల్చుకొని జట్టుకు విజయం సంపాదించాడు.

బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో టోటల్ ఇంజనీర్స్ థామస్ అండ్ ఊబెర్ కప్ ఫైనల్స్ 2022 టోర్నీ బ్యాంకాక్ లో జరుగుతోన్న సంగతి తెలిసిందే.

నేటి మ్యాచ్ లలో….

తొలి మ్యాచ్ లో (సింగిల్స్) లక్ష్య సేన్ పై విక్టర్ ఎక్సెల్సేన్ 21-13; 21-13తో విజయం సాధించాడు

రెండో మ్యాచ్ లో (డబుల్స్) సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ 21-18; 21-23; 22-20తో కిమ్ ఆస్ట్రప్-క్రిస్టియన్ సేన్ ద్వయాన్ని ఓడించారు.

మూడో మ్యాచ్ లో (సింగిల్స్)  కిడాంబి శ్రీకాంత్ 21-18;12-21; 21-15తో అండర్స్ ఆంటోన్సేన్ పై విజయం సాధించి స్కోరు 2-1 ఆధిక్యానికి తీసుకెళ్ళాడు

నాలుగో మ్యాచ్ లో (డబుల్స్) కృష్ణ ప్రసాద్- విష్ణు వర్ధన్ గౌడ్ జోడీపై 21-14; 21-13 తేడాతో అండర్స్ రస్ముస్సేన్- ఫ్రెడరిక్ సోగార్డ్ జంట గెలుపొంది స్కోరు 2-2తో సమం చేశారు.

నిర్ణాయక ఐదో మ్యాచ్ లో హెచ్ ఎస్ ప్రన్నోయ్ 13-21; 21-9; 21-12 తేడాతో  రాస్ముస్ జెమ్కే ను ఓడించాడు. 

Also Read : ఉబెర్ కప్: అమెరికాపై ఇండియా గెలుపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్