టోక్యోలో జరుగుతున్నపారాలింపిక్స్ లో ఇండియా మరో పతకం సాధించింది. పురుషుల హైజంప్ టి-64 విభాగంలో మన దేశానికి చెందిన ప్రవీణ్ కుమార్ రజత పతకం సాధించాడు. 2.07 మీటర్ల ఎత్తుతో ఈ విభాగంలో ఆసియా ఖండం రికార్డు నెలకొల్పిన మరో ఘనత కూడా సాధించాడు.
ఆగస్ట్ 31 న హై జంప్ టి-63 విభాగంలో మనదేశ క్రీడాకారులు మరియప్పన్ తంగవేలు, శరద్ కుమార్ లు రజత, కాంస్య పతకాలు గెల్చుకున్న సంగతి తెలిసిందే. నిన్న, మొన్న మన ఆటగాళ్ళు పతకాలు సాధించలేదు, దీనితో ఇండియా శిబిరంలో కాస్త నిరాశ నెలకొంది. అయితే నేడు ప్రవీణ్ కాంస్య పతకం సాధించడంద్వారా భారత క్రీడాభిమానులకు ఊరట ఇచ్చాడు.
ఇప్పటి వరకూ 2 స్వర్ణ, 6 రజతం, మూడు కాంస్య పతకాలతో మనదేశం మొత్తం 11పతకాలు సాధించి పాయింట్ల పట్టికలో 36వ స్థానంలో కొనసాగుతోంది. ప్రవీణ్‌కుమార్‌కు ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ప్రవీణ్ కృషి, పట్టుదలకు నిదర్శనమే ఈ పతకమని అభివర్ణించారు.