Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఆసియా కప్ హాకీ : ఇండియాకు రజతం

ఆసియా కప్ హాకీ : ఇండియాకు రజతం

India won Bronze:  ఆసియా కప్ హాకీ పురుషల టోర్నమెంట్ లో ఇండియా రజత పతకం సాధించింది.  ఇండోనేషియా, జకార్తాలోని జీబీకే స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో మూడో స్థానం కోసం నేడు జరిగిన మ్యాచ్ లో జపాన్ పై 1-0తేడాతో విజయం సాధించింది.

ఆట 7వ నిమిషంలోనే ఇండియా ఆటగాడు పాల్ రాజ్ కుమార్ ఫీల్డ్ గోల్ ద్వారా ఇండియాకు పాయింట్ అందించారు. ఆ తర్వాత పూర్తి సమయం ముగిసే వరకూ ఇరు జట్లూ గోల్  చేయడంలో విఫలం కావడంతో ఇండియా విజయం సాధించింది.

సూపర్-­4లో  భాగంగా నిన్న సౌత్ కొరియాతో జరిగిన మ్యాచ్ 4-4తో డ్రా కావడంతో ఇండియా మూడో స్థానం కోసం జపాన్ తో తలపడాల్సి వచ్చింది. సౌత్ కొరియా- మలేషియా లు టైటిల్ కోసం మరికాసేపట్లో తలపడనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్