India lost: ఆసియా కప్-2020 మహిళల హాకీ టోర్నీలో ఇండియా సెమీఫైనల్లో సౌత్ కొరియా చేతిలో 3-2 తేడాతో ఓటమి పాలైంది. డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఇండియా ఈసారి సెమీస్ లోనే నిష్క్రమించింది.
ఒమన్ లోని సుల్తాన్ ఖబూస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన నేటి మ్యాచ్ లో ఆట 28వ నిమిషంలో ఇండియా గోల్ చేసి బోణీ కొట్టింది. ఆట సగభాగం పూర్తయిన తరువాత వెంటనే 31వ నిమిషంలో సౌత్ కొరియా జట్టు గోల్ చేసి స్కోరు సమం చేసింది.
మరో నిమిషంలో మూడో భాగం ముగుస్తుందనగా 44వ నిమిషంలో కొరియా రెండో గోల్ చేసి ఆధిక్యంలోకి వెళ్ళింది. 47వ నిమిషంలో మరో గోల్ చేసి 3-1 ఆధిక్యం సంపాదించింది. ఆట 54వ నిమిషంలో ఇండియా గోల్ చేసి 2-3 స్కోరుతో ఒక పాయింట్ వెనకబడింది. చివరి ఆరు నిమిషాల్లో ఇండియా మరో గోల్ కోసం పోరాడినా ఫలితం లేకపోయింది. దీనితో పరాజయం పాలు కావాల్సి వచ్చింది.
చైనా-జపాన్ మధ్య మరికాసేపట్లో మొదలయ్యే మ్యాచ్ లో ఓటమి పాలయ్యే జట్టుతో ఎల్లుండి జరిగే మ్యాచ్ లో మూడో స్థానం కోసం తలపడనుంది.
Also Read :సింగపూర్ పై ఇండియా ఘనవిజయం