Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్పురుషుల హాకీ: పోరాడి ఓడిన ఇండియా

పురుషుల హాకీ: పోరాడి ఓడిన ఇండియా

టోక్యో ఒలింపిక్స్ పురుషుల హాకీలో ఇండియా జట్టు సెమీ ఫైనల్లో పోరాడి ఓడిపోయింది. బెల్జియంపై 5-2 తేడాతో పరాజయం పాలైంది. కాంస్య పతకం కోసం రేపు జరిగే మ్యాచ్ లో ఆడనుంది ఇండియా. బెల్జియం ఆటగాడు అలెగ్జాండర్ హెన్రిక్స్ మొత్తం మూడు గోల్స్ చేసి విజయంలో కీకలపాత్ర పోషించాడు.

తోలి సెమీఫైనల్ ఇండియా-బెల్జియం మధ్య నేటి ఉదయం జరిగింది. సాయంత్రం జరిగే మరో సెమి ఫైనల్లో ఆస్ట్రేలియా-జర్మనీ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టుతో ఇండియా రేపు కాంస్య పతకం మ్యాచ్ ఆడనుంది.

ఆట మొదటి క్వార్టర్ లోనే బెల్జియం మొదటి గోల్ చేసింది. ఆ తర్వాత హర్మన్ ప్రీత్ సింగ్, మన్ దీప్ సింగ్ లు చెరో గోల్ చేసి ఇండియా కు 2-1 ఆధిక్యం సంపాదించారు. రెండో క్వార్టర్ లో పెనాల్టీ కార్నర్ ను ఉపయోగించుకొని బెల్జియం మరో గోల్ సాధించింది దీనితో స్కోరు 2-2తో సమం అయ్యింది. మూడో క్వార్టర్ లో ఎవరికీ గోల్ లభించలేదు. చివరి భాగంలో బెల్జియం తన ఆధిపత్యం కొనసాగించింది. బెల్జియం ఆటగాడు అలెగ్జాండర్ హెన్రిక్స్ రెండు గోల్స్ చేసి ఇండియాను కోలుకోకుండా చేశాడు. ఆ తర్వాత ఆట చివరి నిమిషాల్లో జాన్ డోమేన్ మరో గోల్ చేసి 5-2 ఆధిక్యాన్ని సంపాదించాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్