Monday, June 15, 2026
Homeస్పోర్ట్స్మహిళల ప్రోలీగ్: ఇండియాపై అర్జెంటీనా విజయం

మహిళల ప్రోలీగ్: ఇండియాపై అర్జెంటీనా విజయం

Women’s Pro League: ప్రోలీగ్ మహిళల హాకీ టోర్నీలో భాగంగా ఇండియా- అర్జెంటీనా జట్ల మధ్య నేడు జరిగిన రెండో మ్యాచ్ లో 3-2 తేడాతో అర్జెంటీనా విజయం సాధించింది. నెదర్లాండ్స్ లోని రోటర్ డ్యాం హాకీ క్లబ్ వేదికగా  ఈ మ్యాచ్ జరిగింది.

మ్యాచ్ 23వ నిమిషంలో ఇండియా క్రీడాకారిణి సలీమా ఫీల్డ్ గోల్ ద్వారా స్కోరు బోణీ చేసింది. 38,41,43 నిమిషాల్లో అర్జెంటీనా ఒక ఫీల్డ్, రెండు పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్స్ సాధించి 3-1 ఆధిక్యానికి వెళ్ళింది. ఆట 48వ నిమిషంలో ఎక్కా దీప్ గ్రేస్ మరో గోల్ సాధించి ఆధిక్యాన్ని 3-2కు తగ్గించ గలిగింది.

మ్యాచ్ ముగిసే సమయానికి మరో గోల్ చేయడంలో ఇండియా విఫలం కావడంతో అర్జెంటీనా గట్టెక్కింది.

నిన్న జరిగిన మ్యాచ్ లో ఇండియా షూటౌట్ ద్వారా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మహిళల ప్రోలీగ్ హాకీ టోర్నమెంట్ లో ఇప్పటికే అర్జెంటీనా 42 పాయింట్లతో ఛాంపియన్ గా నిలిచింది.

ఇండియా 24 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. అమెరికాతో మరో రెండు మ్యాచ్ లు ఇండియా మహిళలు ఆడాల్సి ఉంది.

నెదర్లాండ్స్ 32 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular