Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్CWG-2022: Men’s Hockey: సెమీస్ కు ఇండియా!

CWG-2022: Men’s Hockey: సెమీస్ కు ఇండియా!

కామన్ వెల్త్ క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు సెమీ ఫైనల్స్ బెర్త్ దాదాపు ఖరారు చేసుకుంది. నేడు జరిగిన మ్యాచ్ లో కెనడాపై 8-0తేడాతో విజయం సాధించి సత్తా చాటింది.  ఈ మ్యాచ్ కు ముందు జరిగిన మహిళల హాకీ మ్యాచ్ లో కూడా ఇండియా-కెనడా జట్లు తలపడగా 3-2తో మన మహిళా జట్టు గెలుపొంది సెమీస్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. పురుషుల మ్యాచ్ కూడా కెనడా పైనే గెల్చి మెడల్ రేస్ లో నిలవడం విశేషం.

ఇండియా ఆట ఏదో నిమిషంలోనే తొలి గోల్ పెనాల్టీ కార్నర్ ద్వారా సాధించింది. ఆ తర్వాత 10,20, 27, 37,56,58,60 నిమిషాల్లో గోల్స్ చేసి విజయం సొంతం చేసుకుంది. హర్మాన్ ప్రీత్ సింగ్, ఆకాష్ దీప్ సింగ్ చెరో రెండు గోల్స్ చేయగా, రోహిదాస్ అమిత్, లలిత్ కుమార్, గుర్జంత్ సింగ్,  మన్ దీప్ సింగ్ మిగిలిన నాలుగు గోల్స్ చేశారు. మొత్తం గోల్స్ లో ఐదు ఫీల్డ్, మూడు పెనాల్టీ కార్నర్ గోల్స్ ఉన్నాయి.

ఇండియా తన తర్వాతి గ్రూప్ మ్యాచ్ ను వేల్స్ జట్టుతో రేపు ఆడనుంది.

Also Read : ఇండియాకు రజతం

RELATED ARTICLES

Most Popular

న్యూస్