Monday, January 20, 2025
Homeస్పోర్ట్స్Asia Cup: ఇండియా-పాక్ మ్యాచ్ వర్షార్పణం

Asia Cup: ఇండియా-పాక్ మ్యాచ్ వర్షార్పణం

ఆసియా కప్ లో భాగంగా ఇండియా -పాకిస్తాన్ మధ్య మొదలైన మ్యాచ్ భారీ వర్షం కారణంగా మధ్యలోనే రద్దయింది. దీనితో గ్రూప్ దశలో ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తి చేసుకున్న  పాకిస్తాన్ సూపర్ ఫోర్ లో బెర్త్ సాధించింది. శ్రీలంకలోని పల్లెకెలే  ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదలైన మ్యాచ్ లో  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా 66 పరుగులకు నాలుగు వికెట్లు ( రోహిత్ శర్మ- 11; విరాట్ కోహ్లీ 4; శ్రేయాస్ అయ్యర్14; శుభ్ మన్ గిల్-10) కోల్పోయి కష్టాల్లో పడింది. పాక్ బౌలర్లు చక్కని లైన్ అండ్ లెంగ్త్ తో  ఇండియన్ బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టారు.

ఈ దశలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇషాన్ కిషన్ లు ఐదవ వికెట్ కు 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  ఇషాన్ కిషన్ 81 బంతుల్లో 9 ఫోర్లు రెండు సిక్సర్లతో 82; హార్దిక్ పాండ్యా 90బంతుల్లో 7ఫోర్లు, 1 సిక్సర్ తో 87 పరుగులు చేసి ఔటయ్యారు.  48.5 ఓవర్లలో 266 పరుగులకు ఇండియా ఆలౌట్ అయింది.

పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది 4; నసీమ్ షా, హారిస్ రాఫ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

రెండో ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు భారీ వర్షం పడి పిచ్ చిత్తడిగా మారింది. దీంతో ఆటను కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో అంపైర్లు రద్దు చేస్తున్న ప్రకటించారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్