Friday, September 20, 2024
HomeTrending Newsదక్షిణకొరియా కు భారత్ నిరసన

దక్షిణకొరియా కు భారత్ నిరసన

India Protests Against South Korea :

హ్యుందాయ్ కంపనీ వ్యవహారంలో దక్షిణ కొరియా ప్రభుత్వానికి భారత ప్రభుత్వం ఈ రోజు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపింది. హ్యుందాయ్ కంపెనీ ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును పాకిస్తాన్ భారత వ్యతిరేక ప్రచారానికి వాడుకుంటోందని ఢిల్లీ లో దక్షిణ కొరియా రాయబారి చాంగ్ చె బొక్ కి తెలిపింది. ఇలాంటి చర్యలను కట్టడి చేయకపోతే రెండు దేశాల మధ్య దూరం పెరుగుతుందని, హ్యుందాయ్ కంపనీ వ్యవహారంలో కొరియా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఇదే అంశాన్ని దక్షిణ కొరియా రాజధాని సియోల్ లోని భారత రాయబార కార్యాలయం ఆ దేశ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. హ్యుందాయ్ కంపనీ తీరు గర్హనీయమని  నిరసన వ్యక్తం చేసింది.

వివరాల్లోకి వెళితే.. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 5న పాకిస్తాన్ లో కశ్మీర్ ఏర్పాటు వాదానికి మద్దతినిస్తూ.. సంఘీభావ దినోత్సవాన్ని జరుపుతారు. ఈరోజు దేశప్తంగా ర్యాలీలు నిర్వహించి, అమరులైన పాకిస్తాన్ సైనికులకు నివాళులర్పిస్తారు. అయితే ఈ పాకిస్తాన్ సంఘీభావ దినోత్సవానికి తమ మద్దతు తెలుపుతున్నట్లు పాక్ ని సపోర్ట్ చేస్తూ.. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ హ్యుండయ్ సంస్థ.. పాకిస్తాన్ విభాగం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. కశ్మీర్ కోసం త్యాగాలు చేసిన మన సోదరులను స్మరించుకుందాం, స్వేచ్ఛ కాశ్మీర్ కోసం వారికి మద్దతు ఇద్దాం.. అంటూ ట్వీట్ చేసింది.

హ్యుండాయ్ కంపెనీ తీరుపై భారతీయులు మండిపడ్డారు.. ఎక్కువమంది నెటిజన్లు.. తాము ఇక నుంచి దక్షిణ కొరియాకు చెందిన హ్యుండయ్, కియా కార్లను ఖరీదు చేసే ప్రసక్తే లేదని.. మా దేశం నుంచి ఈ కంపెనీలు వెళ్ళిపొమ్మని కోరుతూ.. సదరు కంపెనీలపై భారతీయులు ఓ రేంజ్ లో దండయాత్ర చేశారు. వరసగా ట్వీట్ల వర్షం కురిపించారు. అప్పటికి జరిగిన నష్టం.. తప్పుని గ్రహించిన హ్యుండయ్ సంస్థ దిగివచ్చి.. భారతీయుల మనోభావాలను ఇబ్బంది పెట్టినందుకు క్షమించమని కోరింది. తాము భారతీయులతో గత 25 ఏళ్లుగా బంధం ఏర్పరచుకున్నామని.. వారిని బాధపెట్టే పనులు ఎప్పుడు చేయలేదని.. ఎవరు చేసినా సహించమంటూ క్షమాపణలు చెప్పింది. వెంటనే పాకిస్తాన్ విభాగం చేసిన ట్వీట్ ను డిలీట్ చేసింది. కార్ల అమ్మకాల్లో హ్యుండాయ్ కంపెనీకి భారతదేశం రెండో అతిపెద్ద మార్కెట్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్