KL Rahul: Player of the Match: సెంచూరియన్ టెస్టులో సౌతాఫ్రికాపై ఇండియా 113 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో సౌతాఫ్రికాను 191 పరుగులకే కట్టడి చేశారు. సౌతాఫ్రికాకు 305 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇండియా నిర్దేశించిన సంగతి తెలిసిందే. నాలుగు వికెట్లకు 94 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేడు ఐదోరోజు బ్యాటింగ్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా మరో 97 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. నిన్న 52 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్న కెప్టెన్ ఎల్గర్ 77 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్ లో ఎల్బీగా ఔటయ్యాడు. తర్వాతి ఆటగాళ్ళలో తెంబా బావుమా ఒక్కడే అత్యధికంగా 35 పరుగులు చేయగలిగాడు. బుమ్రా, షమీ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ లో ఇండియా 1-0 ఆధిక్యం సంపాదించింది.
ఇండియా తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన కెఎల్ రాహుల్ కు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ లభించింది.
జనవరి 03 నుంచి జోహేన్స్ బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ మొదలు కానుంది.
Also Read : ప్రొ కబడ్డీ: ఢిల్లీ భారీ విజయం