ప్రొ కబడ్డీ: ఢిల్లీ భారీ విజయం  

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో ఢిల్లీ 17పాయింట్ల తేడాతో బెంగాల్ పై ఘన విజయం సాధించింది. ఢిల్లీ రైడర్ నరేష్ కుమార్ 24పాయింట్లు సాధించి రికార్డు నెలకొల్పాడు.

దబాంగ్ ఢిల్లీ – బెంగాల్ వారియర్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్లో ఢిల్లీ 52-35 తేడాతో ఘనవిజయం సాధించింది. ఆట మొదటి నుంచే ఢిల్లీ సత్తా చాటింది. ఫస్ట్ హాఫ్ లో 33-15 తో ఢిల్లీ 18 పాయింట్ల ఆధిక్యం సంపాదించింది. రెండో అర్ధ భాగంలో బెంగాల్ పుంజుకొని ఆడినప్పటికీ తొలి అర్ధంలో  ఢిల్లీ సంపాదించిన ఆధిక్యాన్ని దాటలేకపోయింది. రెండో భాగంలో 20-19తో బెంగాల్ ఒక పాయింట్ ఆధిక్యం సంపాదించగలిగింది.

యూపీ యోధ  – గుజరాత్ జెయింట్స్  మధ్య జరిగిన రెండో మ్యాచ్ 32-32 తో డ్రా గా ముగిసింది. తొలి అర్ధ భాగంలో గుజరాత్ 20-14 తో ఆరు పాయిట్ల ఆధిక్యం సంపాదించింది. ద్వితీయార్ధంలో  యూపీ సత్తా చాటి హోరా హరీ తలపడింది. 18-12తో ఆధిక్యం సాధించింది.

Also Read : ప్రొ కబడ్డీ: పాట్నా విజయం, టైటాన్స్ ఓటమి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *