Friday, March 13, 2026
Homeసినిమాజూనియ‌ర్ ఎన్టీఆర్.. ఇండియ‌న్ సినిమా అదృష్టం : రాజ‌మౌళి

జూనియ‌ర్ ఎన్టీఆర్.. ఇండియ‌న్ సినిమా అదృష్టం : రాజ‌మౌళి

Rajamouli on Jr. NTR: ‘బాహుబ‌లి’ త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన‌ ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. ఇప్ప‌టి వ‌ర‌కు నార్త్ లో భారీ స్థాయిలో ప్రమోషన్ చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్.. ఇప్పుడు సౌత్ లో ప్ర‌మోష‌న్స్ పై దృష్టి పెట్టింది. చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని చాలా గ్రాండ్ గా నిర్వహించింది. ఈ వేడుకకు తమిళ్ స్టార్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

రాజ‌మౌళి మాట్లాడుతూ “జూనియర్ ఎన్టీఆర్ నాకంటే సీనియర్‌.. అందుక‌నే అత‌నితో ఎప్పుడూ గొడవపడుతుంటాను. అతడిది చైల్డ్‌ మెంటాలిటీ.. లైన్ ప‌ర్స‌నాలిటీ. తారక్‌ ప్రేమను తట్టుకోవటం చాలా కష్టం. అత‌నికి అస్స‌లు టైమ్‌ సెన్స్ లేదు. 7 గంట‌ల‌కు ర‌మ్మంటే.. 6 గంట‌ల‌కే వ‌చ్చేస్తాడు. ఈ కార‌ణంగా తిడుతుంటాను. యాక్షన్‌ అంటే చాలు.. నా మనసులో ఏం ఉందో అలానే చేస్తాడు. ఇలాంటి నటుడు దొరకడం నా ఒక్కడి అదృష్టం కాదు.. అలాగే తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ అదృష్టం మాత్ర‌మే కాదు.. ఇండియ‌న్ సినిమా అదృష్టం” అంటూ ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేశాడు రాజ‌మౌళి.

Also Read :ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ల పై స‌ల్మాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular