Monday, June 8, 2026
Homeస్పోర్ట్స్CWG-2022: ఇండియాకు మరో రెండు రజతాలు

CWG-2022: ఇండియాకు మరో రెండు రజతాలు

కామన్ వెల్త్ గేమ్స్ లో ఇండియా నేడు మరో రెండు రజత పతకాలు సాధించింది. తొలుత పది కిలోమీటర్ల రేస్ వాక్ లో ప్రియాంక గోస్వామి రజతం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పురుషుల మూడు వేల మీటర్ల స్టిపెల్ ఛేజ్ లో అవినాష్ ముకుంద్ సబ్లే రజత పతకం సంపాదించాడు.

లాన్ బౌల్స్ పురుషుల (నలుగురు) విభాగంలో భారత ఆటగాళ్ళు సునీల్ బహదూర్, నవనీత్ సింగ్, చందన్ కుమార్ సింగ్, దినేష్ కుమార్ లతో కూడిన జట్టు నేడు జరిగిన ఫైనల్లో నార్తర్న్ ఐర్లాండ్ పై 5-18 తేడాతో ఓటమి పాలై రజతం సంపాదించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular