భారత విదేశాంగ శాఖ మంత్రి డా. ఎస్. జైశంకర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. యూఎన్ సెక్రెటరీ జనరల్ అంటోనియో గుటేరస్ తో అయన భేటి కానున్నారు. భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం పొందిన తరువాత తొలిసారి భారత విదేశాంగ మంత్రి ఐక్యరాజ్యసమితి ప్రతినిధును కలుసుకుంటున్నారు.
మంగళవారం వాషింగ్టన్ డిసిలో అమెరికా విదేశాంగ కార్యదర్శి అంటోని బ్లింకెన్ తో జై శంకర్ భేటి సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆ ప్రభుత్వ కీలక ప్రతినిధితో మన విదేశాంగ మంత్రి జరుపుతున్న ఈ బేటికి ప్రాధాన్యం ఏర్పడింది.
ఐదు రోజుల పర్యటనలో వాషింగ్టన్ డిసి కేబినేట్ సభ్యులతో పాటు సీనియర్ అధికారులు, వ్యాపార వేత్తలను కూడా కలుసుకుంటారు. కోవిడ్ నివారణపై రెండు దేశాల పరస్పర సహకారంపై కూడా చర్చిస్తారు.