Sunday, June 14, 2026
Homeస్పోర్ట్స్CWG-2022: Hockey (M): ఘనాపై ఇండియా ఘన విజయం

CWG-2022: Hockey (M): ఘనాపై ఇండియా ఘన విజయం

కామన్ వెల్త్ గేమ్స్  పురుషుల హాకీ తొలి గ్రూప్ మ్యాచ్ లో ఇండియా సత్తా చాటింది. ఘనాపై 11-0తో ఘనవిజయం సాధించింది. వైస్ కెప్టెన్  హార్మన్ ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్ సాధించగా, జుగ్ రాజ్ రెండు గోల్స్  చేశాడు.  మొత్తం గోల్స్ లో 4 ఫీల్డ్ గోల్స్, 6 పెనాల్టీ కార్నర్, ఒక ఫీల్డ్ స్ట్రోక్ గోల్స్ ఉన్నాయి. ఏ దశలోనూ ఘనా జట్టు పోటీ ఇవ్వలేకపోయింది.

ఆట రెండో నిమిషంలో అభిషేక్ పెనాల్టీ కార్నర్ గోల్ చేసి బోణీ కొట్టాడు. 10, 14, 20, 22,35, 38, 39 43, 48, 53 నిమిషాల్లో ఇండియా గోల్స్ చేసింది.

ఇండియా పురుషుల జట్టు తన రెండో మ్యాచ్ ను ఆస్ట్రేలియా తో సోమవారం ఆడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular