Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఉబెర్ కప్: అమెరికాపై ఇండియా గెలుపు

ఉబెర్ కప్: అమెరికాపై ఇండియా గెలుపు

Come On India: బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అధ్వర్యంలో జరుగుతోన్న టోటల్ ఇంజనీర్స్ థామస్ ఉబెర్ కప్ ఫైనల్స్ -2022లో భాగంగా నేడు ఇండియా- అమెరికా మహిళల జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 4-1 తేడాతో ఇండియా విజయం సాధించింది.

సింగిల్స్ విభాగంలో

పివి సింధు 21-10; 21-11 తేడాతో జెన్నీ గాయ్;

ఆకర్షి కాశ్యప్  21-18; 21-11తో ఈస్తర్ షీ;

ఆశ్మిత చలిహా 21-18; 21-13 తో నటాలీ చీ లపై విజయం సాధించారు.

డబుల్స్ విభాగంలో

తానీషా క్రాస్టో – త్రెసా జాలీ జంట 21-19;21-10తో ఫ్రాన్సెస్కా కార్బెట్ –అల్లిసన్ లీ జోడీపై విజయం సాధించారు.

సిమ్రాన్ సింఘి-రితికా థాకర్ జోడీ 12-21; 21-17; 13-21 తేడాతో లారెన్ లామ్-కోడి టాంగ్ లీ చేతిలో ఓటమి పాలయ్యారు.

మొన్న కెనడాతో జరిగిన మ్యాచ్ ను 4-1 తేడాతో గెల్చుకొని ఇప్పటికే క్వార్టర్స్ కు చేరుకున్న ఇండియా  మహిళల జట్టు రేపు 11వ తేదీన సౌత్ కొరియాతో తలపడనుంది.  మనదేశంతో పాటు సౌత్ కొరియా కూడా క్వార్టర్స్ కు చేరుకుంది.

Also Read : థామస్ కప్: కెనడాపై ఇండియా గెలుపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్