Sunday, June 14, 2026
Homeస్పోర్ట్స్Asia boxing championship-2022:  మహిళా బాక్సర్ల సత్తా

Asia boxing championship-2022:  మహిళా బాక్సర్ల సత్తా

జోర్డాన్ లో జరుగుతోన్న ఆసియ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత మహిళలు సత్తా చాటారు. నేడు ఒక్కరోజే నాలుగు స్వర్ణాలు, ఒక రజతంతో పతకాల పంట పండించారు.

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెల్చుకున్న లవ్లీనా బోర్గేయిన్  75కిలోల విభాగంలో ఉజ్బెకిస్తాన్  క్రీడాకారిణి సోఖిబా పైఒ 5-0తేడాతో విజయం సాధించి పసిడి పతకం సొంతం చేసుకుంది.

అంతకుముందు  63 కిలోల విభాగంలో 63కిలోల విభాగంలో పర్వీన్ హుడా 5-0తో జపాన్ కు చెందిన కితో మాయ్ పై విజయం సాధించింది.

81 కిలోల విభాగంలో స్వీటీ బోరా కజకిస్తాన్ ప్లేయర్  ఎర్జాన్ పై  5-0తో విజయం సాధించి గోల్డ్ ఖాయం చేసుకోగా,

81 ప్లస్ కిలోల విభాగంలో  ఫైనల్స్ కు చేరిన జోర్డాన్ క్రీడాకారిణి ఇస్లామ్ హుసైలిని అధికారులు డిస్ క్వాలిఫై చేయడంతో అల్ఫియా ఖాన్ ను విజేతగా ప్రకటించారు.

52 కిలోల విభాగంలో మీనాక్షి 1-4 తేడాతో ఓటమి పాలై కాంస్యంతో  సరిపెట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular