Sunday, January 19, 2025
HomeTrending Newsమహిళల హాకీ: సెమీస్ లో ఇండియా

మహిళల హాకీ: సెమీస్ లో ఇండియా

భారత మహిళా హాకీ జట్టు  అద్భుత ఆట తీరు ప్రదర్శించి సెమీస్ కు దూసుకెళ్లింది. టోక్యో ఒలింపిక్స్ మహిళా హాకీ  క్వార్టర్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా పై 1-0 తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్లో బెర్త్ ఖరారు చేసుకుంది.  41 ఏళ్ళ తరువాత ఒలింపిక్స్ లో భారత పురుషుల జట్టు సెమీస్ కు చేరిన మర్నాడే మహిళా జట్టు కూడా సెమీస్ కు అర్హత సాధించడం విశేషం.

ఆట మొదటి పావు భాగంలో రెండు జట్లు హోరాహోరీ తలపడినప్పటికీ గోల్ సాధించలేక పోయాయి, ఆ రెండో క్వార్టర్ లో ఇండియా క్రీడాకారిణి గుర్జీత్ గోల్ సాధించింది. మూడు, నాలుగో  క్వార్టర్ లో  రెండు జట్లూ గోల్స్ సాధించలేదు.  గుర్జీత్ సాధించిన గోల్ తో ఇండియా విజయ బావుటా ఎగరేసింది.

ఒలింపిక్స్ లో మహిళా విభాగంలో హాకీని ప్రవేశ పెట్టిన తొలి ఏడాది 1980లో మాత్రమే ఇండియా జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. మళ్ళీ 36 ఏళ్ళ తరువాత 2016లో బ్రెజిల్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. కానీ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈ ఒలింపిక్స్ లోనూ మొదటి మూడు మ్యాచ్ ల్లోనూ ఓటమి పాలైనా నిరాశ పడకుండా తరువాతి రెండు గేమ్ లు గెలిచి క్వార్టర్స్ కు, ఇప్పుడు  సెమీస్ కు చేరుకొని చరిత్ర సృష్టించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్