Inflation In Pakistan : పాకిస్థాన్‌లో నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్థాన్‌లోని మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలు పెద్ద సమస్యగా పరిగణించటం లేదు. అయితే ద్రవ్యోల్బణం వల్ల వారి జీవితాలు దుర్భరంగా మారాయి. పాకిస్తాన్ ప్రభుత్వం మైనారిటీలు, పేదల రక్షణ కోసం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం 70 ఏళ్లలో గరిష్ట స్థాయికి చేరుకుంది. పాకిస్తాన్‌లో ఆహార ధరలు రెండింతలు పెరిగాయి.
దేశంలోని ప్రధాన నగరాలు మినహా అన్ని పట్టణాలు, గ్రామాల్లో గ్యాస్ కొరత ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. లీటరు పెట్రోలు రూ.150కి ఎలా చేరుతోందో పంచదార కూడా కిలో రూ.150కి చేరుకుంటుందని ప్రజలు చెబుతున్నారు. చిన్న పిజ్జా విలువ 400 రూపాయలు, కాఫీ 200 రూపాయలు అని ఇక్కడి యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఒక సామాన్య వ్యక్తి ఇల్లు నడపడం కష్టంగా మారింది. అయినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ఇంత జరుగుతున్నా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్,కశ్మీర్ సమస్యలను బూచిగా చూపి ప్రజలను మబ్య పెట్టె ప్రయత్నం చేస్తోంది. ఆఫ్ఘన్ ను అంతర్జాతీయ సమాజం గుర్తించక పోతే సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. మరోవైపు బలూచిస్తాన్ లో హక్కుల కార్యకర్తలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని నిష్కర్షగా పాక్ సైనిక వర్గాలు హతమారుస్తున్నాయి.