Thursday, April 25, 2024
HomeTrending Newsఫెయిల్యూర్స్ కు కారణం ప్రభుత్వ వైఫల్యమే- బండి సంజయ్

ఫెయిల్యూర్స్ కు కారణం ప్రభుత్వ వైఫల్యమే- బండి సంజయ్

ఇంటర్మీడియట్ ఫలితాల్లో పాస్ శాతం తక్కువగా ఉండటం ఆందోళనకరమని, ఇందుకు కారణం ప్రభుత్వ విధానాలే అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. విద్యాశాఖలో ఏళ్ల తరబడి అధ్యాపక పోస్టులను భర్తీ చేయకపోవడమే ముఖ్య కారణమని ఆరోపిస్తూ ఈ రోజు బహిరంగ లేఖ విడుదల చేశారు.

లేఖలో ముఖ్యాంశాలు…

ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిలయ్యామనే బాధతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం మనసును తీవ్రంగా కలిచి వేస్తోంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పడుతున్న బాధను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఈ సందర్భంగా విద్యార్థి లోకానికి నేను మనవి చేస్తున్నా…. విద్యార్థులారా… క్షణికావేశంతో నూరేళ్ల జీవితాన్ని పాడుచేసుకోకండి. మీపైనే ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చకండి. పరీక్షల్లో తప్పినంత మాత్రాన జీవితం ముగిసినట్లు కాదు. మీకు ఎంతో బంగారు భవిష్యత్తు ఉంది. సప్లిమెంటరీ పరీక్షలు రాసే అవకాశాలున్నాయి. భవిష్యత్తులో ఎదగడానికి మరెన్నో అవకాశాలున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోండి.

తల్లిదండ్రులకు కూడా విజ్ఝప్తి చేస్తున్నా… పోటీ ప్రపంచంలో మార్కులే అంతిమం అనే భావనతో పిల్లలపై లేనిపోని ఒత్తిడి పెంచకండి. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లిన వాళ్లలో ఎంతో మంది పరీక్షల్లో ఫెయిలైన వారేనని… అధైర్యపడకుండా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని పై స్థాయికి వెళ్లాలనే విషయాన్ని పిల్లలకు అర్ధమయ్యేలా వివరించండి.

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యధిక శాతం మంది విద్యార్ధులు ఫెయిలవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కారణమని చెప్పక తప్పదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిత్యం రాజకీయాలే తప్ప విద్యాశాఖను పట్టించుకున్న పాపానపోలేదు. ఫలితంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వేలాది అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏళ్ల తరబడి వాటిని భర్తీ చేయకపోవడంతో విద్యా ప్రమాణాలు కొరవడ్డాయి. చాలా కాలేజీల్లో సిలబస్ కూడా పూర్తి కాని పరిస్థితి. ఆ ప్రభావం విద్యార్థులపై పడటంతో చాలా మంది విద్యార్థులు ఫెయిలవుతున్నారు. సరిపడా అధ్యాపకులు, సౌకర్యాలున్న కళాశాలల్లో నూటికి నూరశాతం ఫలితాలు వచ్చిన విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలి. ఇకనైనా సీఎం కేసీఆర్ రాజకీయాలు పక్కనపెట్టి విద్యాశాఖపై ద్రుష్టి పెట్టాలి. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలి. విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించాలని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

Also Read : ఇంట‌ర్ ఫ‌లితాల్లో మెరిసిన గురుకుల విద్యార్థులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్