సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగో విజయం అందుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో నేడు జరిగిన మ్యాచ్ లో 67 పరుగులతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. భారీ లక్ష్య సాధనలో ఢిల్లీ 19.1 ఓవర్లలో 199 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
తొలి ఓవర్ నుంచే ఎదురుదాడి ప్రారంభించింది ఢిల్లీ. ఓపెనర్ పృథ్వీ షా వరుసగా నాలుగు ఫోర్లు కొట్టి ఐదో బంతికి ఔటయ్యాడు. రెండో ఓవర్లో భువనేశ్వర్ తొలి మూడు బంతులూ వైడ్లు వేసినా చివరి బంతికి డేవిడ్ వార్నర్ ను ఔట్ చేశాడు.
సుందర్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఫ్రాజేర్ మెక్ గర్క్ మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో ౩౦ పరుగులు చేశాడు. పవర్ ప్లే ముగిసే నాటికి 2 వికెట్లు కోల్పోయి8 8 పరుగులు చేసింది. ఏడో ఓవర్లో మార్కండే బౌలింగ్ లో కూడా మూడు సిక్సర్లు బాదిన మెక్ చివరి బంతికి క్లాసేన్ పట్టిన క్యాచ్ కు ఔటయ్యాడు. 18 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 65 రన్స్ చేసిన మెక్ ఔట్ తో హైదరాబాద్ ఊపిరి పీల్చుకుంది. ఐపీఎల్ చరిత్రలో వేగంగా అర్ధ సెంచరీ చేసిన రికార్డును (15 బంతుల్లోనే) మెక్ నెలకొల్పాడు. ఆ తర్వాత అభిషేక్ పోరెల్ 22 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్సర్ తో 42; కెప్టెన్ రిషభ్ పంత్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 44 పరుగులు చేయగలిగారు. ఢిల్లీ 199 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ట్రావిస్ హెడ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.
ఈ సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్ లో కోల్ కతాపై ఓటమి పాలైన గుజరాత్ రెండో మ్యాచ్ లో ముంబై పై ఘన విజయం సాధించింది. మూడో మ్యాచ్ లో గుజరాత్ చేతిలో ఓడిపోయినా ఆ తరువాత వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.