Sunday, June 2, 2024
HomeTrending Newsఐదు చోట్ల టిడిపి అభ్యర్ధుల మార్పు: బిజెపి నుంచి నల్లమిల్లి

ఐదు చోట్ల టిడిపి అభ్యర్ధుల మార్పు: బిజెపి నుంచి నల్లమిల్లి

తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్పు చేసింది. మరో స్థానంలో తమ పార్టీ నేతను బిజెపి గుర్తుపై పోటీ చేయిస్తోంది. లోక్ సభ, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో బీఫామ్ లు పంపిణీ చేశారు. రాష్ట్రానికి ఈశాన్యం మూలలో ఉన్న శ్రీకాకుళం లోక్ సభ స్థానానికి గాను కింజరాపు రామ్మోహన్ నాయుడుకు మొదటి బీ ఫాం ను అందజేశారు.
ఇక అభ్యర్థుల మార్పి విషయానికొస్తే…

  • ఉండి స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు బదులుగా కనుమూరు రఘురామ కృష్ణంరాజు
  • పాడేరులో కె. వెంకట రమేష్ నాయుడు స్థానంలో గిడ్డి ఈశ్వరి
  • మాడుగుల – పైలా ప్రసాద్ స్థానంలో బండారు సత్యనారాయణమూర్తి
  • మడకశిరలో ఎంఈ సునీల్ కుమార్ స్థానంలో పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ ఎంఎస్ రాజు
  • వెంకటగిరి కురగొండ్ల లక్ష్మి ప్రియ స్థానంలో ఆమె తండ్రి రామకృష్ణ లకు అవకాశం కల్పించారు.

మరోవైపు అనపర్తి సీటు విషయంలో పీటముడి వీడింది. ఆ సీటును టిడిపి తీసుకొని దానికి బదులుగా దెందులూరు లేదా తంబళ్లపల్లె లో ఒకదాన్ని ఇవ్వాలని టిడిపి ప్రతిపాదించగా… దీనిపై బిజెపి తన వైఖరి స్పష్టం చేయలేదు. అయితే దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేస్తున్న రాజమండ్రి లోక్ సభ పరిధిలో ఉన్న అనపర్తి నుంచి నల్లమిల్లి కృష్ణా రెడ్డిని బిజెపి అభ్యర్ధిగా పోటీ చేయించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సీనియర్ నేతల బుజ్జగించడంతో ఆయన అంగీకరించి రేపు బిజెపిలో చేరనున్నారు. ఇప్పటికే ప్రకటించిన బిజెపి అభ్యర్ధి శివరామ కృష్ణంరాజు స్థానంలో కృష్ణారెడ్డి పోటీ చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్