Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్ఢిల్లీపై కోల్ కతా విజయం

ఢిల్లీపై కోల్ కతా విజయం

ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ మూడు వికెట్లతో విజయం సాధించింది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్ కతా కెప్టెన్ మోర్గాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ  జట్టులో పృథ్వీ షా స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ చోటు సంపాదించాడు. కోల్ కతాలో ఆండ్రూ రస్సెల్, ప్రసిద్ కృష్ణ స్థానంలో సౌతీ, సందీప్ వారియర్ లకు అవకాశం కల్పించారు.

కోల్ కతా బౌలర్లు రాణించడంతో ఢిల్లీ ఆటగాళ్ళలో ఓపెనర్లు స్టీవ్ స్మిత్-39 (34 బంతుల్లో 4 ఫోర్లు); శిఖర్ ధావన్-24(20 బంతుల్లో 5 ఫోర్లు);  కెప్టెన్ రిషభ్ పంత్-39 (36 బంతుల్లో 3ఫోర్లు) మినహా మిగిలిన ఆటగాళ్ళు రాణించలేకపోయారు. దీనితో 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది.  కోల్ కతా బౌలర్లలో వెంకటేష్ అయ్యర్, సునీల్ నరేన్, ఫెర్గ్యుసన్ తలా రెండు వికెట్లు, సౌతీ ఒక వికెట్ పడగొట్టారు. పంత్, ఆవేష్ ఖాన్ లు రనౌట్ అయ్యారు.

స్వల్ప లక్ష్యమైనా కోల్ కతా ప్రయాస పడాల్సివచ్చింది. త్వరగా విజయం సాధించాలన్న తాపత్రయంతో వెంట వెంట వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ శుభమన్ గిల్-30 (33 బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు); సునీల్ నరేన్-21 (10 బంతుల్లో 1 ఫర్ 2 సిక్సర్లు); నితీష్ రానా-36 నాటౌట్ (27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో 18.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.  ఢిల్లీ బౌలర్లలో అవేష్ ఖాన్-­3, నార్త్జ్, అశ్విన్, లలిత్ యాదవ్, రాబడ తలా ఒక వికెట్ పడగొట్టారు.

కోల్ కతా ఆటగాడు సునీల్ నరేన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్