Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్పంజాబ్ పై గెలుపు; ప్లేఆఫ్ కు బెంగుళూరు

పంజాబ్ పై గెలుపు; ప్లేఆఫ్ కు బెంగుళూరు

రాయల్ ఛాలంజర్స్ బెంగుళూరు జట్టు ఈ సీజన్ ఐపీఎల్ ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా నేడు జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై ఆరు పరుగులతో విజయం సాధించి బెర్త్ ఖరారు చేసుకుంది. గ్లెన్ మ్యాక్స్ వెల్, పడిక్కల్ బ్యాటింగ్ లోను, యజువేంద్ర చాహల్ బౌలింగ్ లోను రాణించి బెంగుళూరు విజయంలో కీలక భూమిక పోషించారు. 33 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసిన మ్యాక్స్ వెల్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

టాస్ గెలిచిన బెంగుళూరు కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పడిక్కల్, కోహ్లీ తొలి వికెట్ కు 68 పరుగులు జోడించారు. కోహ్లీ 25 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన క్రిస్టియన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ పడిక్కల్ (40) వెనుదిరిగాడు. ఏబీ డివిలియర్స్, మ్యాక్స్ వెల్ లు నాలుగో వికెట్ కు 73 పరుగులు జోడించారు. ఏబీ 18 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 23 పరుగులు చేశాడు. 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో హెన్రిక్యుస్, షమీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

పంజాబ్ ఇన్నింగ్స్ ధాటిగానే ఆరంభించింది. మొదటి వికెట్ కు కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ 91 పరుగులు చేశారు. కెప్టెన్ రాహూల్ 39 పరుగులు చేసి ఔటయ్యాడు. మయాంక్ అగర్వాల్ 46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. చివర్లో షారూక్ ఖాన్ గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. అయితే హర్షల్ పటేల్ అతన్ని రనౌట్ చేయడంతో పంజాబ్ ఆశలు ఆవిరయ్యాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్