Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్IPL: ముంబైపై బెంగుళూరు గెలుపు

IPL: ముంబైపై బెంగుళూరు గెలుపు

ఐపీఎల్ లో నేడు జరిగిన రెండో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై 8 వికెట్ల తేడాతో బెంగుళూరు ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 82 నాటౌట్ ; కెప్టెన్ డూప్లేసిస్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో  72 పరుగులు చేసి తొలి వికెట్ కు 148 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దినేష్ కార్తీక్ డకౌట్ అయినా,  గ్లెన్ మాక్స్ వెల్ 12 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. దీనితో ముంబై ఇచ్చిన 172 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆర్సీబీ 16.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

బెంగుళూరు చిన్న స్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై 20 పరుగులకే మూడు వికెట్లు (ఇషాన్ కిషన్-10; కామెరూన్ గ్రీన్-5; రోహిత్ శర్మ-1) కోల్పోయి కష్టాల్లో పడింది. సూర్య కుమార్ యాదవ్ (15) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో తిలక్ వర్మ 46 బంతుల్లో   9 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు, 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 రన్స్ సాధించింది.

బెంగుళూరు బౌలర్లలో కర్న్ శర్మ 2;  సిరాజ్, తోప్లె, ఆకాష్ దీప్, హర్షల్ పటేల్. బ్రేస్ వెల్ తలా ఒక వికెట్ సాధించారు.

డూప్లేసిస్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్