Monday, January 20, 2025
Homeస్పోర్ట్స్హైదరాబాద్ కు ఊరట విజయం

హైదరాబాద్ కు ఊరట విజయం

ఐపీఎల్ ఈ సీజన్లో వరుస పరాజయాలతో డీలాపడ్డ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊరట లభించింది. నేడు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్లతో విజయం సాధించింది. సన్ రైజర్స్ ఓపెనర్ జేసన్ రాయ్ 42 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్సర్ తో 60 పరుగులు; కెప్టెన్ కేన్ విలియమ్సన్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్సర్ తో 51 పరుగులతో అజేయంగా నిలిచి హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శ్యామ్సన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.  జట్టు స్కోరు 11 పరుగుల వద్ద  ఓపెనర్ లూయీస్ (6) వికెట్ కోల్పోయింది.  మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తో కలికి కెప్టెన్ సంజూ రెండో వికెట్ కు 56 పరుగులు జోడించారు. జైశ్వాల్ 36 పరుగులు (23 బంతుల్లో 5 ఫోర్లు, 1  సిక్సర్) చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన లివింగ్ స్టోన్(6) వెంటనే ఔటైనా సంజూ-లోమ్రార్ కలిసి నాలుగో వికెట్ కు 84 పరుగుల  భాగస్వామ్యం నెలకొల్పారు. 57 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేసిన సంజూ శ్యామ్సన్ సిద్దార్థ్ కౌల్ బౌలింగ్ లో హోల్డర్ అందుకున్న క్యాచ్ కు ఔటయ్యాడు. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.  హైదరాబాద్ బౌలర్లలో సిద్దార్థ్ కౌల్-2, సందీప్ శర్మ, భువనేశ్వర్, రషీద్ ఖాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

హైదరాబాద్ జట్టులో డేవిడ్ వార్నర్ స్థానంలో జేసన్ రాయ్ ఓపెనర్ గా వృద్ధిమాన్ సాహాతో కలిసి బరిలోకి దిగాడు. మొదటి ఓవర్ నుంచే సన్ రైజర్స్ దాడి ప్రారంభించింది. తొలి వికెట్ కు 57 పరుగులు జోడించారు. సాహా తన 18 పరుగుల స్కోరు వద్ద లోమ్రార్ బౌలింగ్ లో ఔటయ్యాడు. జేసన్ కు జత కలిసిన కెప్టెన్ విలియమ్సన్ రెండో వికెట్ కు  మరో 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత రాయ్ ఔటయినా విలియమ్సన్ జట్టును విజయంవైపు నడిపించారు.

జేసన్ రాయ్ కు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్