Saturday, January 18, 2025
HomeTrending Newsఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి దుర్మరణం

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి దుర్మరణం

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ  హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.  ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్  తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్స్ జోల్ఫా సమీపంలోని పర్వతాల్లో  ఆదివారం కూలిపోయింది. అజర్ బైజాన్ సరిహద్దుల్లో డ్యామ్ ప్రారంభించిన తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.  దాదాపు 17 గంటల రెస్క్యూ ఆపరేషన్ తరువాత హెలికాప్టర్ ఆచూకీ లభించింది. రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయినట్లు గుర్తించారు. ఆయనతో పాటు హెలికాప్టర్ లో ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేన్ అమిరబ్దుల్లా కూడా ఉన్నారు.

రైసీ హెలికాప్టర్ శకలాలను రెస్క్యూ టీమ్‌లు కనుగొన్నాయని పలు ఇరాన్ మీడియా చానెళ్ళు వెల్లడించాయి. ప్రమాద స్థలంలో ఎవరూ సజీవంగా ఉన్నట్లు ఎటువంటి సంకేతాలు కనుగొనబడలేదని తేల్చింది. రైసీతో పాటు హెలికాప్టర్‌లో విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మాలెక్ రహ్మతి, తబ్రిజ్ రాయల్ ఇమామ్ మొహమ్మద్ అలీ అల్హాషెమ్, ఒక పైలట్, సెక్యూరిటీ చీఫ్ , ఒక సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నారని ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ తెలిపింది. ఇరాన్ అధ్యక్షుడి కాన్వాయ్‌లో మూడు హెలికాప్టర్లు ఉండగా వీటిలో రెండు వాటి గమ్యస్థానంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి.

ఇరాన్-అజర్ బైజాన్ దేశాల సరిహద్దుల్లో రెండు డ్యామ్ లు రిరు దేశాలూ కలిసి నిర్మించారు. ఆదివారం తెల్లవారుజామున అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్‌తో కలిసి ఈ ఆనకట్టను రైసి ప్రారంభించారు. అనంతరం తబ్రిజ్ పట్టణానికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.  భారత్ స్నేహ సంబంధాలు బలపర్చేందుకు ఇబ్రహీం రైసీ ప్రత్యేక చొరవ చూపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్