Friday, March 13, 2026
Homeస్పోర్ట్స్రేహానే, జడేజా, ఇషాంత్ ఔట్

రేహానే, జడేజా, ఇషాంత్ ఔట్

Siraj, Umesh in:
ఇండియా- న్యూజిలాండ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా చివరి టెస్ట్ ముంబై వాంఖేడ్ స్టేడియంలో నేడు మొదలైంది. పిచ్ తడిగా ఉండడంతో మ్యాచ్ ను అనుకున్న సమయానికి ప్రారంభించలేదు. ఉదయం 9.30 గంటలకు అంపైర్లు పిచ్ పరిస్థితిని పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు, 10.30 కు మరోసారి సమీక్షిస్తామని చెప్పారు. అయితే రెండోసారి పరిశీలన సమయంలో పిచ్ ఆటకు అనుకూలంగా ఉందని  నిర్ధారించి టాస్ కు ఒకే చెప్పారు.

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి టెస్ట్ లో కెప్టెన్ గా వ్యవహరించిన అజింక్యా రేహానే, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మలు గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యారు. విరాట్ కోహ్లీ తిరిగి జట్టులో చేరాడు. విరాట్ తో పాటు మహమ్మద్ సిరాజ్,  జయంత్ యాదవ్ లు జట్టులోకి వచ్చారు. మయాంక్ అగర్వాల్, శుభమన్  గిల్ లు ఇండియా ఇన్నింగ్స్ ప్రారంభించారు.

కాన్పూర్ లో జరిగిన తొలి టెస్ట్ డ్రా గా ముగిసిన సంగతి తెలిసిందే

Also Read : డ్రా గా ముగిసిన తొలి టెస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular