Thursday, June 18, 2026
HomeసినిమాIsmart Shankar 2: రామ్, పూరి మూవీ ఇంట్రస్టింగ్ అప్ డేట్

Ismart Shankar 2: రామ్, పూరి మూవీ ఇంట్రస్టింగ్ అప్ డేట్

పూరి జగన్నాథ్ లైగర్ డిజాస్టర్ తర్వాత చాలా కథలు రెడీ చేశాడు. కొంత మంది హీరోలను కలవడం.. కథలు చెప్పడం జరిగింది  కానీ.. ప్రాజెక్ట్ సెట్ కాలేదు. అయితే.. రామ్ కి కథ చెప్పి ఎట్టకేలకు ఒప్పించాడు. ప్రస్తుతం పూరి ముంబాయిలో డైలాగ్ వెర్షెన్ రెడీ చేస్తున్నాడు. మరో వైపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. రామ్ బోయపాటితో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తైన తర్వాత పూరితో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. ఆగష్టు నుంచి ఈ మూవీ సెట్స్ పైకి రానుందని సమాచారం.

అయితే… ఈ వార్త తెలిసినప్పటి నుంచి రామ్, పూరి కాంబోలో ఇస్మార్ట్ శంక్ సీక్వెల్ చేయనున్నారా..? వేరే కథతో మూవీ చేయనున్నారా..? అనేది ఆసక్తిగా మారింది. మేటర్ ఏంటంటే… ‘ఇస్మార్ట్ శంకర్ 2’ చేయనున్నారని తెలిసింది. ఇంట్రస్టింగ్ అప్ డేట్  ఏంటంటే… ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదల అయిన జులై 18న ఈ కొత్త సినిమాను విడుదల చేయాలి అనుకుంటున్నారట. ఇస్మార్ట్ శంకర్ సెంటిమెంట్ తో 2024 జులై 18న రామ్.. పూరి కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్, బోయపాటి మూవీ మాస్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేలా ఉంటుందట.

ఆతర్వాత ఇస్మార్ట్ శంకర్ 2 అంటే మరింత క్రేజ్ ఉంటుంది. ఈసారి ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ సాధించాలని పూరి కసితో ఉన్నాడు. చాలా ఫాస్ట్ గా సినిమా కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ టైమ్ తీసుకోవాలి అనుకుంటున్నాడట. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరీ సినిమాను విడుదల చేయాలనేది ప్లాన్. త్వరలోనే ఈ సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని పూరి బ్యానర్ లోనే నిర్మించనున్నారు. మరి.. ఇస్మార్ట్ శంకర్ 2తో పూరి బ్లాక్ బస్టర్ సాధించి మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular