Wednesday, June 17, 2026
HomeసినిమాPrabhas: ప్రభాస్ తో పవర్ స్టార్ డైరెక్టర్ మూవీ..?

Prabhas: ప్రభాస్ తో పవర్ స్టార్ డైరెక్టర్ మూవీ..?

ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ జూన్ 16న విడుదల అవుతుంటే.. సెప్టెంబర్ 28న ‘సలార్’ మూవీ రిలీజ్ కానుంది. సంక్రాంతికి ‘ప్రాజెక్ట్ కే’ విడుదల కానుంది. ఆతర్వాత సమ్మర్ లో మారుతితో చేస్తున్న మూవీ రిలీజ్ కానుంది. ఆతర్వాత సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయనున్నారు. అయితే.. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఇప్పుడు మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది.

ఇంతకీ ఎవరితో అంటే.. బాహుబలి ప్రొడ్యూసర్స్ తో మూవీ చేసేందుకు ఓకే చెప్పారని… ఇటీవల ప్రభాస్ ని శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ కలిసింది ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకే అని తెలిసింది. ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి ప్రభాస్ తో బాహుబలి 3 ప్లాన్ జరుగుతుందని… గతంలో రాజమౌళి కూడా బాహుబలి 3 ఉంటుందని చెప్పారని వార్తలు వచ్చాయి. అయితే… ప్రభాస్ తో బాహుబలి నిర్మాతలు తీసేది బాహుబలి 3 కాదట. ఎందుకంటే రాజమౌళి ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అందుచేత ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది.

ఈలోపు ప్రభాస్ తో మరో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యారట. మరి.. డైరెక్టర్ ఎవరంటే.. క్రిష్ పేరు వినిపిస్తుంది. వీరితో క్రిష్‌కు మంచి అనుబంధమే ఉంది. వేదం సినిమాకు శోభు, ప్రసాద్ నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరించారు. క్రిష్‌తో కలిసి ఒక కథ మీద శోభు, ప్రసాద్ చాన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నారు. ఇంకా కథ కొలిక్కి రాలేదు కానీ.. ఈ లోపే ప్రభాస్ వారికి సినిమా చేయడానికి మాట ఇచ్చాడని తెలిసింది. ప్రస్తుతం క్రిష్.. పవన్ కళ్యాణ్‌తో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఇలాంటి భారీ చిత్రం తీసిన అనుభవంతో ప్రభాస్‌తోనూ చారిత్రక నేపథ్యం ఉన్న కథను తీయాలనేది క్రిష్ ఆలోచన. మరి.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను త్వరలో అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular