కర్ణాటక రాష్ట్రానికి ఆర్థికంగా గుండెకాయ… దక్షిణ భారత దేశంలో ఐటి పరిశ్రమకు కేరాఫ్ గా ఉన్న బెంగళూరు నగరం ఉహించని రీతిలో విస్తరిస్తోంది. అయితే ప్రభుత్వాల నిర్లక్ష్యం బెంగళూరు నగరానికి శాపంగా మారింది. ట్రాఫిక్ రద్దీకి తగినట్టు ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పించకపోవడంతో నగర ఆర్థిక వ్యవస్థకు రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లుతున్నది. నెటిజన్లు, ప్రజా సంఘాలు నిత్యం విమర్శిస్తుంటే.. ఎట్టకేలకు మేల్కొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యపై ఒక అధ్యయనం చేయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కొన్నేండ్లుగా భారీగా పెరిగిన నగర జనాభాకు, వాహనాలకు తగ్గట్టుగా రోడ్ల విస్తరణ లేకపోవడంతోనే ట్రాఫిక్ సమస్య పెరిగిందని నిపుణులు పేర్కొన్నారు. రోడ్ ప్లానింగ్, ఫ్లై ఓవర్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, మౌలిక సదుపాయాలను పరిశీలించి..అవి ట్రాఫిక్ రద్దీకి తగినట్టు లేవని, వాటిని మరింత మెరుగు పరచాలని అభిప్రాయపడ్డారు. ఐటీ పరిశ్రమ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ట్రాఫిక్ జామ్‌ల వల్ల ఎక్కువగా నష్టపోతున్నాయని అధ్యయన నివేదిక పేర్కొంది.