Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన వాల్తేరు వీరయ్య అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ మెగామాస్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించింది.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… వాల్తేరు వీరయ్య చిత్రం కోసం టీం అందరితో కలసి సమిష్టి కృషి చేస్తూ బ్లాక్ బస్టర్ అయ్యి తీరుతుందనే నమ్మకంతో పని చేశాం. మేము ఏదైతే అనుకున్నామో అది నెరవేరిన తర్వాత ఒక్కసారిగా మాటలు కొరవడిపోయాయి. ఈ సమయంలో మేము మాట్లాడటం ఆపేసి ప్రేక్షకులు చెబితే వినాలని మనస్పూర్తిగా అనిపిస్తుంది. ప్రేక్షకుల స్పందననే మా ఇంధనం. అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఒక సినిమా అద్భుతంగా వస్తుందంటే దానికి కారణం ఆ సినిమాకి పని చేసే కార్మికులు. వాల్తేరు వీరయ్య విజయం సినిమాకు పని చేసిన కార్మికులది. ఇందులో పని చేసిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు, అభినందనలు.

రవితేజ, బాబీ, దేవిశ్రీ, నిర్మాతలు రవి, నవీన్ , మిగతా నటీనటులు ఇలాంటి అద్భుతమైన టీమ్ తో కలసి పని చేయడం చాలా ఆనందంగా వుంది. వాల్తేరు వీరయ్య విజయం సమిష్టి కృషి. సినిమా ఇంత గ్రాండ్ గా చేయడం మైత్రీ మూవీ మేకర్స్ వలనే సాధ్యమైయింది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టం. వారితో మళ్ళీ కలసి పని చేయాలని వుంది. దర్శకుడు బాబీ ఈ కథని అద్భుతంగా మలిచారు. అనుభవంతో ఏదైనా సూచన చెబితే.. దాని ఒక సవాల్ గా తీసుకొని ఎక్స్ ట్రార్డినరీ వర్క్ చేశాడు. ఇది అందమైన స్క్రీన్ ప్లే. యంగ్ స్టర్స్ దీనిని ఒక కేస్ స్టడీలా చూడాలి.

బాబీ సినిమా మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ సరిగ్గా నిద్రపోలేదు. సినిమాని చాలా ప్లానింగ్ తో పర్ఫెక్ట్ గా తీశాడు. అందుకే నిర్మాతలకు ఎలాంటి భారం లేకుండా సజావుగా సాగింది. ఈ రోజు అందరు దర్శకులు విజయం ఇవ్వడం కంటే నిర్మాత బడ్జెట్ కి సినిమా తీయడం మొదటి సక్సెస్ గా భావించాలి. దర్శకులే నిర్మాతలని బ్రతికించాలి. పక్కా పేపర్ వర్క్ చేయాలి. నిర్మాతలు ఉంటేనే నటీనటులు బావుంటారు. నా తమ్ముడు రవితేజ లేకపోతే సెకండ్ హాఫ్ లో ఇంత అందం వచ్చేది కాదు. ఇందులో గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు వస్తున్నాయని మా డివోపీ విలన్స్ గారు అన్నారు. ఎదురుగా వున్నది నా తమ్ముడని చెప్పా. రవితేజ లేకపోతే ఆ ఎమోషన్ వచ్చేది కాదు. దేవిశ్రీ తన మ్యూజిక్ తో పూనకాలు తెప్పించాడు. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, ఆర్థర్ విలన్స్ అందరూ అద్భుతంగా పని చేశారు. మంచి కంటెంట్ ఇస్తే ఆదరించి ప్రేక్షకులే తిరిగి థాంక్స్ చెబుతారని వాల్తేరు వీరయ్య నిరూపించింది. ప్రేక్షకులు చెబుతున్న థాంక్స్ కి తిరిగి థాంక్స్ చెబుతున్నాం.’’ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com