- భారతీయ కుటుంబ వ్యవస్థలో రెండు దశాబ్దాల్లో అనూహ్యమైన మార్పులొచ్చాయి.
- విడాకుల సంఖ్య గతంతో పోలిస్తే విపరీతంగా పెరిగింది.
- ముప్పయ్యేళ్ళు దాటినా పెళ్ళి కుదరనివారు; అసలు పెళ్ళి జోలికే వెళ్ళని వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
- పట్టణీకరణ, మహిళల చదువులు, ఉద్యోగాలు, ఆర్థికాభివృద్ధి, చైతన్యం తదితరాలను స్వాగతించాల్సిందే. కుటుంబ వ్యవస్థలో మార్పులకు ఇవి కూడా ప్రధానమైన కారణాలు.
Youtube : https://www.youtube.com/@MahathiBhakthi
Facebook : https://www.facebook.com/mahathibhakthi
Instagram: https://www.instagram.com/mahathibhakthi/
Twitter : https://x.com/Dhatri_Tv
- కుటుంబ తగాదాలు పెరగడానికి కేవలం మహిళలే కారణం కాదు. మారిన కాలానికి అనుగుణంగా మహిళల స్థానాన్ని గుర్తించకపోవడంతో వస్తోంది సమస్య.
- మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కుటుంబాలు ప్రత్యేకించి భర్తలు, అత్తమామలు మారకపోవడంవల్ల గత పదేళ్ళలో జరిగిన పెళ్ళిళ్ళలో కనీసం 40 శాతం పెటాకులయ్యాయి.
- భార్య వేళకు టిఫిన్ వండిపెట్టలేదని మొదలైన గొడవ విడాకుల దాకా వెళుతోంది. ఫ్యామిలీ కోర్టుల్లో లెక్కలేనన్ని కేసులు పెండింగ్ లో ఉంటున్నాయి.
- ఉద్యోగి అయినా, సాధారణ గృహిణి అయినా భార్య చేసే పనులు, ఆమె శారీరక, మానసిక శ్రమను గుర్తించాలి.
- చిన్న చిన్న గొడవలకు దంపతులు విడిపోతున్నారు. అన్నెం పున్నెం ఎరుగని వారి పిల్లలు నరకయాతన అనుభవిస్తున్నారు.
- సమాజం తీరు మారకపోతే…బలమైన భారతీయ కుటుంబ వ్యవస్థ పునాదులతోపాటు విచ్ఛిన్నమయ్యే ప్రమాదముంది.
ఈ మాటలన్నది భారత సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి బి వి నాగరత్న. “భారతీయ సమాజానికి కుటుంబమే పునాది” అన్న అంశంపైఅన్న అంశంపై బెంగళూరులో జరిగిన దక్షిణాది ప్రాంతీయ సదస్సులో ఆమె ఉపన్యసించారు. సుప్రీం కోర్టులో ఫ్యామిలీ కోర్టుల కమిటీకి ఆమె చెయిర్ పర్సన్ కూడా. తను ప్రస్తావించిన వివరాలన్నీ నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ సమాచారం ప్రకారమేనని ఆమె ఆధారాలను కూడా చూపించారు.
సగానికి పైగా పెళ్ళిళ్ళు పెటాకులై…భార్యాభర్తలు ఎవరికి వారు వడివడిగా విడాకులు తీసుకుంటుంటే వికసిత్ భారత్ వస్తుందా? వచ్చినా దాన్ని వికసిత్ భారత్ అనగలమా? ఆ మూడు ముళ్ల మంత్రం-
“మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!! ” అవుతుందా?
“మాంగల్యం తంతునా నేను?” అవుతుందా!!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు