Friday, March 29, 2024
Homeసినిమాప‌వ‌న్ రాక‌పై హింట్ ఇచ్చిన‌ బాల‌య్య‌

ప‌వ‌న్ రాక‌పై హింట్ ఇచ్చిన‌ బాల‌య్య‌

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ఓ వైపు బిగ్ స్ర్కీన్  పై సినిమాలు చేస్తూనే మ‌రో వైపు స్మాల్ స్ర్కీన్ పై ‘అన్ స్టాప‌బుల్’ అంటూ టాక్ షో చేస్తున్నారు. ఆహాలో స్ట్రీమింగ్ అయిన అన్ స్టాప‌బుల్ టాక్ షో ఫ‌స్ట్ సీజ‌న్ సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. దీంతో ఇటీవ‌ల రిలీజ్ చేసిన అన్ స్టాప‌బుల్ టీజ‌ర్ అయితే… ఇప్ప‌టి వ‌ర‌కుఈ షో పై ఉన్న అంచ‌నాల‌ను రెట్టింపు చేసింద‌ని చెప్ప‌చ్చు.

అన్ స్టాప‌బుల్ సెకండ్ సీజ‌న్ లో ఫ‌స్ట్ ఎపిసోడ్ ను నారా చంద్ర‌బాబు నాయుడు, లోకేష్ ల‌తో స్టార్ట్ చేశారు. ఈ ఎపిసోడ్ కు చాలా మంది రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఈ సీజ‌న్ లో ‘ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్’ పాల్గొంటారని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నిజంగానే ప‌వ‌న్ క‌ళ్యాణ్.. బాల‌య్య టాక్ షో వ‌స్తారా..? అనేది ఆస‌క్తిగా మారింది.  అయితే.. రెండో ఎపిసోడ్ ప్రోమో బయటకి వచ్చింది.

ఈ ప్రోమోలో యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ పాల్గొనగా నిర్మాత నాగవంశీ కూడా వచ్చారు. నాగ వంశీ నుంచి దర్శకుడు త్రివిక్రమ్ తో బాలయ్య మాట్లాడుతూ నడిచిన సంభాషణ ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. ఇంత‌కీ ఏమ‌న్నారంటే… నా షో కి ఎప్పుడు వస్తున్నావ్ త్రివిక్రమ్ అంటూ బాలయ్య అడగ్గా మీరు రమ్మంటే ఇప్పుడే వ‌చ్చేస్తాను అని త్రివిక్రమ్ బదులిచ్చారు. బాలయ్య దీనికి స‌మాధానంగా… ఎవరితో రావాలో తెలుసుగా అంటూ చెప్పడంతో అది పవనే అని అందరికీ కన్ఫర్మ్ అయ్యిపోయింది. దీనితో ఈ ప్రోమో ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. మ‌రి.. ప‌వ‌న్ ను బాల‌య్య ఇంట‌ర్ వ్యూ చేస్తే.. అది ఇంకెంతగా వైర‌ల్ అవుతుందో చూడాలి.

Also Read : చంద్రబాబు పతనం “అన్ స్టాపబుల్”..అంబటి విమర్శ

RELATED ARTICLES

Most Popular

న్యూస్